వడదెబ్బతో నలుగురు మృతి
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా ఏప్రిల్ మాసంలో సగం కూడా గడవక ముందే భానుడి ప్రతాపం మనిషిపై బాగా పడుతోంది. ఈ ఎండకు తాళలేక వడదెబ్బ బారిన పడి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని కావేరి(15), మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామానికి చెందిన కూలీ మైనొద్దిన్(42) వ్యవసాయ పొలంలో చెక్‌డ్యామ్‌కు పునాది తవ్వడానికి వెళ్లి వడదెబ్బకు […]
BY Pragnadhar Reddy7 April 2015 4:23 AM IST
Pragnadhar Reddy Updated On: 7 April 2015 4:23 AM IST
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా ఏప్రిల్ మాసంలో సగం కూడా గడవక ముందే భానుడి ప్రతాపం మనిషిపై బాగా పడుతోంది. ఈ ఎండకు తాళలేక వడదెబ్బ బారిన పడి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని కావేరి(15), మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామానికి చెందిన కూలీ మైనొద్దిన్(42) వ్యవసాయ పొలంలో చెక్‌డ్యామ్‌కు పునాది తవ్వడానికి వెళ్లి వడదెబ్బకు గురై మరణించాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడుకు చెందిన వృద్ధురాలు పూనెం భద్రమ్మ(60) కొద్దిరోజులుగా మిర్చితోటలో కాయలు ఏరేందుకు వెళుతున్న క్రమంలో వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం బూర్గుపేటకు చెందిన ఉపాధి కూలీ మీనుగు చం ద్రయ్య (45) రోడ్డు పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక రోహిణీ కార్తె నాటికి ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.-పీఆర్
Next Story