మిషన్ కాకతీయకు మరో వంద కోట్లు
మిషన్ కాకతీయలో కొన్ని కొత్త చెరువులకు అనుమతి ఇస్తూ సాగు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా చేర్చిన చెరువుల కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.250 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మొత్తం 173 పనుల కోసం రూ.200 కోట్ల నాబార్డు నిధులకు రాష్ట్ర వాటాగా రూ.50 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. కాగా దేవాదుల ప్రాజెక్టులో భాగంగా […]
BY Pragnadhar Reddy6 April 2015 2:19 AM IST
Pragnadhar Reddy Updated On: 6 April 2015 2:19 AM IST
మిషన్ కాకతీయలో కొన్ని కొత్త చెరువులకు అనుమతి ఇస్తూ సాగు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా చేర్చిన చెరువుల కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.250 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మొత్తం 173 పనుల కోసం రూ.200 కోట్ల నాబార్డు నిధులకు రాష్ట్ర వాటాగా రూ.50 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. కాగా దేవాదుల ప్రాజెక్టులో భాగంగా పిల్ల కాల్వలను తవ్వడానికి ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు చెల్లించే ధరను పెంచింది.
Next Story