వేసవిలో కరెంటు కోతలుండవు!
తెలంగాణ రాష్ట్రంలో.. మండు వేసవిలో.. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్తు డిమాండ్ పతాక స్థాయికి చేరినా..కరెంట్ కోతలు విధించే ప్రసక్తే లేదని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. ఇప్పటికే డిమాండ్ భారీగా పెరుగుతున్నా… దీటుగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. విద్యుత్తు డిమాండ్, సరఫరాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రోజూ మూడు పూటలూ లోతైన సమీక్ష జరుపుతున్నారని చెప్పారు. వ్యవసాయ డిమాండ్ తగ్గిందని, అందువల్లే తాము ఈ ఏడాది డిమాండ్‌ను తట్టుకోగలుతున్నామని అన్నారు. విద్యుత్తు […]
BY Pragnadhar Reddy5 April 2015 11:00 PM GMT
Pragnadhar Reddy Updated On: 5 April 2015 9:06 PM GMT
తెలంగాణ రాష్ట్రంలో.. మండు వేసవిలో.. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్తు డిమాండ్ పతాక స్థాయికి చేరినా..కరెంట్ కోతలు విధించే ప్రసక్తే లేదని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. ఇప్పటికే డిమాండ్ భారీగా పెరుగుతున్నా… దీటుగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. విద్యుత్తు డిమాండ్, సరఫరాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రోజూ మూడు పూటలూ లోతైన సమీక్ష జరుపుతున్నారని చెప్పారు. వ్యవసాయ డిమాండ్ తగ్గిందని, అందువల్లే తాము ఈ ఏడాది డిమాండ్‌ను తట్టుకోగలుతున్నామని అన్నారు. విద్యుత్తు సరఫరాకు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నామని, ఇప్పటికే నాఫ్తా వైపు దృష్టి సారించామని చెప్పారు. రిలయన్స్ సహజ వాయు సంస్థతో సంప్రదింపులు జరిపామని, దానిని కూడా వినియోగించుకుంటామని, అవసరమైతే యూనిట్ రూ.9.80 నుంచి పది రూపాయల వరకూ ఉన్నప్పటికీ కాయంకుళం విద్యుత్తును కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రజలకు కరెంటు కోతల్లేని విద్యుత్తును అందిస్తామన్నారు.-పీఆర్
Next Story