Telugu Global
National

మౌలిక వసతులకు మరింత సాయం

న్యాయవ్యవస్థలో మరిన్ని నియామకాలు, నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం కేంద్రం భారీగా సాయం చేయాలని ఎన్డీఏయేతర పార్టీల పాలనలోని రాష్ర్టాలు డిమాండ్‌ చేశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీహార్‌ సీఎం నితీశ్‌, అసోం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌లు హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు సమావేశంలో ప్రధానంగా ఈ డిమాండ్ వినిపించారు. 14వ ఆర్థిక సంఘం ఈ విషయమై పెద్దగా కేటాయింపులు చేయలేదని, పన్నుల్లో రాష్ర్టాల వాటా పెంచుతామని మాత్రమే చెప్పిందని, కాబట్టి న్యాయవ్యవస్థ అవసరాల దృష్ట్యా భారీగా గ్రాంట్స్‌ […]

న్యాయవ్యవస్థలో మరిన్ని నియామకాలు, నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం కేంద్రం భారీగా సాయం చేయాలని ఎన్డీఏయేతర పార్టీల పాలనలోని రాష్ర్టాలు డిమాండ్‌ చేశాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీహార్‌ సీఎం నితీశ్‌, అసోం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌లు హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు సమావేశంలో ప్రధానంగా ఈ డిమాండ్ వినిపించారు. 14వ ఆర్థిక సంఘం ఈ విషయమై పెద్దగా కేటాయింపులు చేయలేదని, పన్నుల్లో రాష్ర్టాల వాటా పెంచుతామని మాత్రమే చెప్పిందని, కాబట్టి న్యాయవ్యవస్థ అవసరాల దృష్ట్యా భారీగా గ్రాంట్స్‌ ఇవ్వాలని సిద్దరామయ్య కోరారు. తాము వనరుల లేమితో బాధ పడుతున్నామని, త‌మ రాష్ట్రాలు న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు నిధులు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని అంటూ కేంద్ర‌మే పెద్ద మ‌న‌సు చేసుకుని నిధులు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రులు నితీశ్‌, గొగోయ్ కేంద్రాన్ని కోరారు.-పీఆర్‌
First Published:  6 April 2015 3:12 PM IST
Next Story