Telugu Global
Others

మోడీ హిందుత్వ భావ‌జాలంలో ఉన్నారా?

‘నా ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తుంది’ అని మోదీ చెబుతున్నప్పటికీ.. హిందూత్వ భావజాల వ్యాప్తి దేశమంతటా విస్తరిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన గత పది నెలల్లో కేంద్రం లేదా బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న హిందూత్వ అనుకూల నిర్ణయాలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా చెబుతున్నాయి. మ‌హారాష్ట్రలో గోమాంసంపై నిషేధం విధించినా, తమ రాష్ట్రం నుంచి బీఫ్‌ ఎగుమతికి అంగీకరించబోమని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించినా, భగవద్గీతను జాతీయగ్రంథంగా ప్రకటించాలని […]

‘నా ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తుంది’ అని మోదీ చెబుతున్నప్పటికీ.. హిందూత్వ భావజాల వ్యాప్తి దేశమంతటా విస్తరిస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన గత పది నెలల్లో కేంద్రం లేదా బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న హిందూత్వ అనుకూల నిర్ణయాలు ఈ విష‌యాన్ని స్ప‌ష్టంగా చెబుతున్నాయి. మ‌హారాష్ట్రలో గోమాంసంపై నిషేధం విధించినా, తమ రాష్ట్రం నుంచి బీఫ్‌ ఎగుమతికి అంగీకరించబోమని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించినా, భగవద్గీతను జాతీయగ్రంథంగా ప్రకటించాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ వ్యాఖ్యానించినా, పాఠశాల విద్యలో భగవద్గీతను చేర్చడం వల్ల సమాజానికి సరైన దిశ చూపిస్తుందని హర్యానా సీఎం ఖట్టర్‌ పేర్కొన్నా, గోవధపై దేశవ్యాప్తంగా నిషేధం తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించినా.. 800 సంవత్సరాల తరువాత దేశంలో హిందూత్వాన్ని పరిరక్షించే ప్రభుత్వం వచ్చిందని విశ్వహిందూ పరిషత్‌ సీనియర్‌ నేత అశోక్‌సింఘాల్‌ అన్నా.. హిందూదేశంలో ఉండే వారంతా హిందువులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ సారథి మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించినా.. ఆర్టికల్‌ 370, ఉమ్మడి సివిల్‌ కోడ్ తదితర అంశాలపై కేంద్రంలో కీలక పదవుల్లో ఉన్న నేతలు వ్యాఖ్యలు చేసినా.. అవన్నీ ప్రభుత్వ వైఖరికి భిన్నం అని చెప్పలేని పరిస్థితి. ఇన్ని హిందుత్వ వాద‌న‌ల నేప‌థ్యంలో మోడీ ప్ర‌భుత్వం అన్ని మ‌తాల‌ను స‌మానంగా చూస్తుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించ‌గ‌ల‌దా అన్న ప్ర‌శ్న ఎవ‌రికైనా ఉద‌యిస్తుంది.-పీఆర్‌
First Published:  6 April 2015 5:05 AM IST
Next Story