Telugu Global
National

పాపం... అద్వానీ

బెంగళూరులో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆ పార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీకి అవమానాలు ఎదురయ్యాయి. మూడు రోజులపాటు జరిగిన సమావేశాలలో అద్వానీకి ఎక్కడా మాట్లాడే అవకాశం లభించలేదు. తొలిరోజు.. ‘పదాధికారుల సమావేశం. ఆయనకు ప్రాధాన్యం ఉండదు’ అన్న విష‌యం అంద‌రికీ తెలుసు. రెండో రోజు.. కార్యవర్గ సమావేశం… పార్టీ అధ్యక్షుడిదే నిర్ణయం. బహిరంగసభలో మాట్లాడతారని చెప్పారుగానీ.. చోటు కల్పించలేదు. చివరిరోజు సమావేశ వేదికపై ప్రధాని ప్రసంగంతో ముగించారు. అలా అద్వానీకి ఈ మూడు రోజుల్లో […]

బెంగళూరులో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఆ పార్టీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీకి అవమానాలు ఎదురయ్యాయి. మూడు రోజులపాటు జరిగిన సమావేశాలలో అద్వానీకి ఎక్కడా మాట్లాడే అవకాశం లభించలేదు. తొలిరోజు.. ‘పదాధికారుల సమావేశం. ఆయనకు ప్రాధాన్యం ఉండదు’ అన్న విష‌యం అంద‌రికీ తెలుసు. రెండో రోజు.. కార్యవర్గ సమావేశం… పార్టీ అధ్యక్షుడిదే నిర్ణయం. బహిరంగసభలో మాట్లాడతారని చెప్పారుగానీ.. చోటు కల్పించలేదు. చివరిరోజు సమావేశ వేదికపై ప్రధాని ప్రసంగంతో ముగించారు. అలా అద్వానీకి ఈ మూడు రోజుల్లో ఎక్కడా నోరు తెరిచే అవ‌కాశం రాలేదు. ముగింపులో మాత్రం ‘మొక్కుబడి’గా పెద్దాయనను మాట్లాడేందుకు ఆహ్వానించారు. అప్పటికే మనసు గాయపడిన అద్వానీ.. ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్‌ షాలు ఎంత కోరినా మాట్లాడకుండానే.. వెనుదిరిగారు.
సాధారణంగా కార్యవర్గ సమావేశాలలో అద్వానీ ప్రసంగించడం ద‌శాబ్దాలుగా వ‌స్తున్న‌ ఆనవాయితీ. ఈ విషయంలో ఆయనకు గల పదవి, హోదాలను కాకుండా పెద్దరికానికే పార్టీ పెద్దపీట వేస్తూ వస్తున్నది. కానీ ఈసారి ఎందుకనో ఆయన మాట కార్యవర్గ భేటీలో వినిపించలేదు. తొలి పలుకులతో అధ్యక్షుడు అమిత్‌షా సమావేశాలను ప్రారంభించగా..ప్రధాని మోదీ ప్రసంగించారు. రెండోరోజు సాయంత్రం.. బెంగళూరు నేషనల్‌ కళాశాల మైదానంలో బహిరంగసభ జరిగింది. ఇక్కడా అద్వానీకి మాట్లాడే అవకాశంగానీ, సత్కారంగానీ.. ఏదీ దక్కలేదు. రెండు రోజుల సమాలోచనల్లోంచి చేసిన నిర్ణయాలను తీర్మానాల రూపంలో మూడోరోజు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రవేశపెట్టారు. ఇక్కడ కూడా షా, మోదీల గొంతుకలే వినిపించారు. ఈ సమావేశంలో షా, మోదీల పక్క అద్వానీ కూర్చున్నారు అంతే… వారిద్దరిలో ఎవరూ అద్వానీకి మైకు అందించేందుకు ప్రయత్నించలేదు. ఈ ఫ‌లిత‌మే ముగింపు సమావేశంలో… మోదీ స్వయంగా దగ్గరకు వెళ్లి ఆహ్వానించినా… అద్వానీ ప్రసంగించేందుకు నిరాకరించారని సన్నిహితులు చెబుతున్నారు.-పీఆర్‌
First Published:  6 April 2015 4:00 AM IST
Next Story