భూమి పోతుందనే భయంతో రైతు హఠాన్మరణం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తన భూమి పోతుందన్న భయంతో మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం రాంకిష్టాయిపల్లికి చెందిన సన్నకారు రైతు మాసిరెడ్డోళ్ల వెంకట్‌రెడ్డి(52) ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ ఎత్తిపోతల పథకం కింద మండలంలోని కొండాపూర్, హనుమాన్‌పల్లి, చర్లపల్లి, కిష్టాపూర్, రాంకిష్టాయిపల్లితో పాటు 25 గిరిజన తండాలు ముంపుకు గురవుతాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంకిష్టాయిపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి పొలంలో సంప్‌హౌజ్‌ను నిర్మించేందుకు పుల్లమ్మ చెరువు సమీపంలోని వెంకట్‌రెడ్డికి చెందిన ఎకరన్నర భూమిని ఎంపికచేసి, […]
BY Pragnadhar Reddy6 April 2015 11:33 AM IST
Pragnadhar Reddy Updated On: 6 April 2015 11:33 AM IST
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తన భూమి పోతుందన్న భయంతో మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం రాంకిష్టాయిపల్లికి చెందిన సన్నకారు రైతు మాసిరెడ్డోళ్ల వెంకట్‌రెడ్డి(52) ఆకస్మికంగా మృతి చెందాడు. ఈ ఎత్తిపోతల పథకం కింద మండలంలోని కొండాపూర్, హనుమాన్‌పల్లి, చర్లపల్లి, కిష్టాపూర్, రాంకిష్టాయిపల్లితో పాటు 25 గిరిజన తండాలు ముంపుకు గురవుతాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంకిష్టాయిపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి పొలంలో సంప్‌హౌజ్‌ను నిర్మించేందుకు పుల్లమ్మ చెరువు సమీపంలోని వెంకట్‌రెడ్డికి చెందిన ఎకరన్నర భూమిని ఎంపికచేసి, అందులో రాళ్లు పాతారు. దీంతో పదిరోజుల నుంచి వెంకట్‌రెడ్డి మనస్థాపానికి గురయ్యాడు. తమ గ్రామం మునిగిపోతుందని, భూమి పోతుందని తాము ఎలా బతకాలో అర్థం కావడంలేదని కలిసిన ప్రతి ఒక్కరితో ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తీవ్ర కలత చెందిన వెంకట్‌రెడ్డి మృతి చెందాడు. మృతునికి భార్య పద్మమ్మ, కుమారుడు, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. తన భర్త ఎత్తిపోతల పథకంలో భూమి పోతుందనే భయంతోనే కలవరం చెంది ప్రాణాలు కోల్పోయాడని పద్మమ్మ వీఆర్వోకు ఫిర్యాదు చేసింది.-పీఆర్
Next Story