బీఎస్ఎష్ ఖాతాలోకి 2 హెలికాప్టర్లు
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లోకి కొత్తగా రెండు హెలికాప్టర్లు రాబోతున్నాయి. ఎంఐ-17 వీ5 అనే ఈ రకం హెలికాప్టర్లను అత్యాధునిక సౌకర్యాలు ఉన్న వాటిగా పరిగణిస్తారు. రష్యాలో తయారు చేసిన వీటిని భారత్ విడతల వారీగా దిగుమతి చేసుకుంటోంది. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో వీటిని వాడాలని నిర్ణయించినట్లు సమాచారం. బీఎస్ఎఫ్ నేరుగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా… ఇతర పారా మిలిటరీ దళాలైన సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ వంటి వాటి తరఫున గగనతల కార్యకలాపాలను నిర్వర్తిస్తుంటుంది. ఈ హెలికాప్టర్ […]
BY Pragnadhar Reddy6 April 2015 7:49 AM IST
Pragnadhar Reddy Updated On: 6 April 2015 7:49 AM IST
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లోకి కొత్తగా రెండు హెలికాప్టర్లు రాబోతున్నాయి. ఎంఐ-17 వీ5 అనే ఈ రకం హెలికాప్టర్లను అత్యాధునిక సౌకర్యాలు ఉన్న వాటిగా పరిగణిస్తారు. రష్యాలో తయారు చేసిన వీటిని భారత్ విడతల వారీగా దిగుమతి చేసుకుంటోంది. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో వీటిని వాడాలని నిర్ణయించినట్లు సమాచారం. బీఎస్ఎఫ్ నేరుగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా… ఇతర పారా మిలిటరీ దళాలైన సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ వంటి వాటి తరఫున గగనతల కార్యకలాపాలను నిర్వర్తిస్తుంటుంది. ఈ హెలికాప్టర్ గంటకు 250 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది. 4,000 కేజీల సరుకులను మోసుకెళ్లగలదు. ఒక్కసారి ఇంధన ట్యాంకు నింపితే.. 465 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఆరు కిలోమీటర్ల అత్యధిక ఎత్తు వరకు ఎగరగలదు. అంతే కాక ఈ హెలికాప్టర్లకు రాత్రి పూట ప్రయాణించగలిగే సామర్థ్యం కూడా ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.-పీఆర్
Next Story