Telugu Global
National

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఆరో నిందితుడు ఆజాద్‌షేక్‌

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఆజాద్‌షేక్‌ అనే వ్యక్తిని ఆరో నిందితుడిగా చేర్చారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ  ఆజాద్‌షేక్‌ను కోర్టులో హాజరుపరచింది. ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదులకు సిమ్‌కార్డులను సమకూర్చింది ఇతడే అని ఎన్ఐఏ, కోర్టుకు వివరించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ కేసులో  ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆజాద్ షేక్ నుంచి మరిన్ని విషయాలు రాబట్టడానికి 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయ‌స్థానంలో ఎన్ఐఏ కోరినట్లు తెలిసింది.-పీఆర్‌

First Published:  6 April 2015 6:16 AM GMT
Next Story