పీపీపీ పద్ధతిలో టూరిజం ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం ప్రాజెక్టులను ప్రజలు-ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. అసలు ఎక్కడెక్కడ కొత్తగా ఈ పర్యాటక ప్రాజెక్టులను చేపట్టాలి. అవి పర్యాటకులకు ఎంత వరకు ఆనందం పంచుతాయి… వంటి విషయాలను విశ్లేషనాత్మకంగా అధ్యయనం చేయడానికే ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. రాష్ట్రంలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం […]
BY Pragnadhar Reddy5 April 2015 5:16 AM IST
Pragnadhar Reddy Updated On: 5 April 2015 5:16 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం ప్రాజెక్టులను ప్రజలు-ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. అసలు ఎక్కడెక్కడ కొత్తగా ఈ పర్యాటక ప్రాజెక్టులను చేపట్టాలి. అవి పర్యాటకులకు ఎంత వరకు ఆనందం పంచుతాయి… వంటి విషయాలను విశ్లేషనాత్మకంగా అధ్యయనం చేయడానికే ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. రాష్ట్రంలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.-పీఆర్
Next Story