ప్రజల మనిషి... విమలక్క: టీడీపీ
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా గాయని విమలక్కపై బనాయించిన కేసులను తక్షణం ఉపసంహరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కన్నా ముందే ఆమె ఉద్యమం చేపట్టినట్టు గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులను ఐక్యం చేసి వారికిచ్చిన హామీని నెరవేర్చాలని అడిగినందుకు ఆమెపై కేసులు పెట్టారని విమర్శించారు. వాటర్‌గ్రిడ్ పేరిట రూ.40వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును మరో ధన యజ్ఞంగా మార్చేందుకు కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. కాగా దళిత వ్యతిరేక […]
BY Pragnadhar Reddy5 April 2015 3:14 AM IST
Pragnadhar Reddy Updated On: 5 April 2015 3:14 AM IST
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా గాయని విమలక్కపై బనాయించిన కేసులను తక్షణం ఉపసంహరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కన్నా ముందే ఆమె ఉద్యమం చేపట్టినట్టు గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులను ఐక్యం చేసి వారికిచ్చిన హామీని నెరవేర్చాలని అడిగినందుకు ఆమెపై కేసులు పెట్టారని విమర్శించారు. వాటర్‌గ్రిడ్ పేరిట రూ.40వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును మరో ధన యజ్ఞంగా మార్చేందుకు కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. కాగా దళిత వ్యతిరేక విధానాలు వీడనాడాలని మరో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కేసీఆర్‌కు సలహా ఇచ్చారు. కేబినెట్‌లో దళితులకు స్థానం కల్పించాకే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలన్నారు. పన్నెండేళ్ల పాటు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విమలక్కపై కేసులు ఉపసంహరించాలని ఆయన కూడా డిమాండ్ చేశారు.
Next Story