కన్నబిడ్డలనే చంపేసిన కసాయి...
కన్నబిడ్డలనే చంపేసి… ఇంట్లోనే డీప్ ప్రీజర్లో కుక్కేసి ఓ కన్నతల్లి తనలో ఉన్న కసాయితనానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయింది. మిషెల్ బ్లయర్ అనే మహిళ తన బిడ్డలిద్దరు స్టోమీ బ్లయర్ (13), స్టీఫెన్ గేజ్ (9) లను దారుణంగా చంపేసి ఫ్రీజర్ లోని ప్లాస్టిక్ షీటు కింద దాచేసింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో తెలుసుకోవాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆమెకు ఉన్న నలుగురు […]
BY Pragnadhar Reddy5 April 2015 5:30 AM IST
Pragnadhar Reddy Updated On: 5 April 2015 4:26 AM IST
కన్నబిడ్డలనే చంపేసి… ఇంట్లోనే డీప్ ప్రీజర్లో కుక్కేసి ఓ కన్నతల్లి తనలో ఉన్న కసాయితనానికి నిలువెత్తు నిదర్శనంగా మిగిలిపోయింది. మిషెల్ బ్లయర్ అనే మహిళ తన బిడ్డలిద్దరు స్టోమీ బ్లయర్ (13), స్టీఫెన్ గేజ్ (9) లను దారుణంగా చంపేసి ఫ్రీజర్ లోని ప్లాస్టిక్ షీటు కింద దాచేసింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో తెలుసుకోవాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆమెకు ఉన్న నలుగురు సంతానంలో మరో ఇద్దరు పిల్లలు బంధువుల దగ్గర ఉంటున్నారు. వారిలో 17 ఏళ్ల కుమార్తె తన తల్లి క్రూరత్వాన్ని పోలీసులకు వివరించింది. తన చిన్న తమ్ముడిని ఎప్పుడూ హింసించేదని, కొడుతూ, ఇస్త్రీపెట్టె వంటి పరికరాలతో కాలుస్తూ ఉండేదని తెలిపింది. తన తమ్ముళ్లు ఇద్దరికీ మెడ చుట్టూ ప్లాస్టిక్ సంచి బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసిందని తెలిపింది.
Next Story