Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 30

యు ఆర్‌ వాచింగ్‌… భర్త ఇంట్లో ‘హెడెన్‌ కెమేరా ఉందేమోనని వెతుకుతూ ఉంటే భార్య ‘ఏం వెతుకుతున్నావు?’ అని అడిగింది. వెంటనే అతను ”నేను స్టార్‌ టీవీ చూస్తూ ఉంటే అనౌన్సర్‌ ‘యు ఆర్‌ వాచింగ్‌ స్టార్‌ టీవీ’ అని అంది. ఎలా కనుక్కుందో అని వెతుకుతున్నాను’ అన్నాడు. ************ ప్రైవేట్‌క్లాస్‌ ఎవరో మిత్రులు ఒక సభలో ప్రసంగించమని మావారిని ఆహ్వానించడానికి వస్తే, ”నేను పబ్లిగ్గా మాట్లాడను, కావాలంటే ప్రైవేటుగా క్లాసు తీసుకుంటాను” అన్నారు. ************ ముష్టిపూర్తి […]

యు ఆర్‌ వాచింగ్‌…
భర్త ఇంట్లో ‘హెడెన్‌ కెమేరా ఉందేమోనని వెతుకుతూ ఉంటే భార్య ‘ఏం వెతుకుతున్నావు?’ అని అడిగింది. వెంటనే అతను ”నేను స్టార్‌ టీవీ చూస్తూ ఉంటే అనౌన్సర్‌ ‘యు ఆర్‌ వాచింగ్‌ స్టార్‌ టీవీ’ అని అంది. ఎలా కనుక్కుందో అని వెతుకుతున్నాను’ అన్నాడు.

************
ప్రైవేట్‌క్లాస్‌
ఎవరో మిత్రులు ఒక సభలో ప్రసంగించమని మావారిని ఆహ్వానించడానికి వస్తే, ”నేను పబ్లిగ్గా మాట్లాడను, కావాలంటే ప్రైవేటుగా క్లాసు తీసుకుంటాను” అన్నారు.

************
ముష్టిపూర్తి పురాణం
సుబ్రహ్మణ్య శర్మ గారి షష్టిపూర్తికి, మిత్రుడు ఎ.ఆర్‌. కృష్ణ పురాణం గారికి కొంత సొమ్ము బహూకరించడానికి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పోగు చెయ్యడానికి పూనుకున్నాడు. ఒకసారి రావిశాస్త్రి ‘వరద’ని అడిగారు ”షష్టిపూర్తి’ కలెక్షన్‌ పూర్తయిందా?” అని ”షష్టి పూర్తి అయిపోయిందిగాని, ‘ముష్టిపూర్తి’ ఇంకా కాలేదు’ అన్నారు ‘వరద’
************
సంబోధన ఎన్‌.టి.రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే, ”ఇక మనందరం సోదర సోదరీమణు లారా” అనడానికి బదులు ”చౌదరీ, చౌదరీమణు లారా అని సంబోధించాలికాబోలు” అన్నారు ‘వరద’.

First Published:  5 April 2015 12:30 AM IST
Next Story