Telugu Global
NEWS

త‌క్కువ మందితో టీ కాంగ్రెస్‌ కార్యవర్గం

జంబో కార్యవర్గానికి టీ-కాంగ్రెస్‌ తెర దించబోతుంది. తక్కువ మంది నేతలతో, పటిష్టమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాక్పటిమ, విషయ పరిజ్ఞానం, ప్రజల్లో విశ్వసనీయత ఉన్నవారికి, కొత్త ముఖాలకు, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజుతో శనివారం రాత్రి నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. ఇందులో టీపీసీసీ కార్యవర్గ కూర్పుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ప్రస్తుతం టీపీసీసీకి ఉన్న […]

జంబో కార్యవర్గానికి టీ-కాంగ్రెస్‌ తెర దించబోతుంది. తక్కువ మంది నేతలతో, పటిష్టమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాక్పటిమ, విషయ పరిజ్ఞానం, ప్రజల్లో విశ్వసనీయత ఉన్నవారికి, కొత్త ముఖాలకు, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజుతో శనివారం రాత్రి నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. ఇందులో టీపీసీసీ కార్యవర్గ కూర్పుపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ప్రస్తుతం టీపీసీసీకి ఉన్న జంబో కార్యవర్గాన్ని 10 మందికే కుందించాలని నిర్ణయించారు. ఇప్ప‌టికే టీపీసీసీలో అధ్యక్షుడు, కార్యాధ్యక్షుడు, ఐదుగురు ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులున్నారు. వీరు కాకుండా సీనియర్‌ నాయకులతో మరో 16 మంది కార్యవర్గ సభ్యులను నియమించారు. అంటే ఇప్ప‌టికే 31 మందితో కార్య‌వ‌ర్గం ఉంది. ఇంత జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నా… పార్టీ పటిష్టం కావడం లేదని, ఈ దృష్ట్యా కార్యవర్గాన్ని కుదించాలని నిర్ణయించారు.
First Published:  5 April 2015 4:21 AM IST
Next Story