సౌకర్యాలుంటేనే మహిళలకు నైట్ డ్యూటీ
ఆఫీసుల్లో పని చేసే మహిళలకు అక్కడ తగిన సౌకర్యాలుంటేనే నైట్ డ్యూటీ వేసేందుకు అధికారులు అనుమతించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కనీస సౌకర్యాలు లేకుండా మహిళలకు డ్యూటీలు వేసి ఇబ్బందులు పెట్టే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా కార్మికుల నైట్ డ్యూటీ అంశం చంద్రబాబు దృష్టికి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఈమేరకు ఉత్తర్వులొచ్చాయి. ఈనేపథ్యంలో కొన్ని షరతులకు లోబడి కంపెనీ యాజమాన్యాలు మహిళలతో రాత్రి వేళల్లో పనిచేయించుకోవచ్చని స్పష్టం చేస్తూ డైరెక్టర్ […]
BY Pragnadhar Reddy5 April 2015 7:22 AM IST
Pragnadhar Reddy Updated On: 5 April 2015 7:22 AM IST
ఆఫీసుల్లో పని చేసే మహిళలకు అక్కడ తగిన సౌకర్యాలుంటేనే నైట్ డ్యూటీ వేసేందుకు అధికారులు అనుమతించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కనీస సౌకర్యాలు లేకుండా మహిళలకు డ్యూటీలు వేసి ఇబ్బందులు పెట్టే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా కార్మికుల నైట్ డ్యూటీ అంశం చంద్రబాబు దృష్టికి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఈమేరకు ఉత్తర్వులొచ్చాయి. ఈనేపథ్యంలో కొన్ని షరతులకు లోబడి కంపెనీ యాజమాన్యాలు మహిళలతో రాత్రి వేళల్లో పనిచేయించుకోవచ్చని స్పష్టం చేస్తూ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శనివారం సర్క్యులర్ జారీ చేశారు. వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్య సంరక్షణ, విశ్రాంత గదులు, భోజన గదులు, సంబంధిత మహిళల పిల్లలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, టాయ్‌లెట్ సదుపాయాలు కల్పించాలని, వారి హుందాతననానికి, గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుని రాత్రి వేళల్లో వారితో పనిచేయించుకోవచ్చని ఈ సర్క్యులర్‌లో సూచించారు.
Next Story