సీక్రెట్ కెమెరాలపై కేంద్రం నిఘా!
గోవాలో ఓ బట్టల దుకాణంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీక్రెట్ కెమెరా అనుభవం ఎదురవడంతో, ఒక్కసారిగా సీక్రెట్ కెమెరాలపై దేశవ్యాప్తంగా అందరూ ఆందోళన చెందుతున్నారు. కేంద్రం కూడా హడావిడిగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని అంటోంది. అసలు ఈ సీక్రెట్ కెమెరాలను అరికట్టడం ఎంతవరకు సబబు? అని ఆలోచిస్తే, అసాధ్యమేమీ కాదు గానీ, కష్టసాధ్యమైన వ్యవహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఇక్కడ కావాల్సింది పాలకులకు చిత్తశుద్ధి. సీసీ కెమెరా వేరు, సీక్రెట్ కెమెరా […]
BY Pragnadhar Reddy5 April 2015 6:59 AM IST
Pragnadhar Reddy Updated On: 5 April 2015 6:59 AM IST
గోవాలో ఓ బట్టల దుకాణంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీక్రెట్ కెమెరా అనుభవం ఎదురవడంతో, ఒక్కసారిగా సీక్రెట్ కెమెరాలపై దేశవ్యాప్తంగా అందరూ ఆందోళన చెందుతున్నారు. కేంద్రం కూడా హడావిడిగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని అంటోంది. అసలు ఈ సీక్రెట్ కెమెరాలను అరికట్టడం ఎంతవరకు సబబు? అని ఆలోచిస్తే, అసాధ్యమేమీ కాదు గానీ, కష్టసాధ్యమైన వ్యవహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఇక్కడ కావాల్సింది పాలకులకు చిత్తశుద్ధి. సీసీ కెమెరా వేరు, సీక్రెట్ కెమెరా వేరు. ఈ రెండింటికి తేడాను చెరపేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు. దీంతో అసాంఘీక శక్తుల్ని అరికట్టేందుకు ఉద్దేశించబడిన సీసీ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలుగా మారిపోతున్నాయి. అరచేతిలో ఇమిడిపోయే కెమెరా కాదు, కళ్ళద్ధాల్లో ఒదిగిపోయే కెమెరాలు కూడా వచ్చాయి. ఇవి రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈసారి బాధిత మహిళ కేంద్ర మంత్రి కావడంతో సీక్రెట్ కెమెరాలను నిలువరించే విషయంలో కేంద్రం కాస్త వేగంగా స్పందించింది. హడావుడి మానేసి వాస్తవంగా దీన్ని అరికట్టడం ఎలాగో ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది.-పీఆర్
Next Story