కర్ణాటక జెన్‌కోకు భూపాలపల్లి బొగ్గు
మొదటిసారి భూపాలపల్లి కోల్‌బెల్ట్ నుంచి కర్ణాటక జెన్‌కోకు బొగ్గు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి, కర్ణాటక జెన్‌కో మధ్య అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉన్నప్పటికీ ట్రాన్స్‌పోర్టు కంపెనీల టెండర్లకు రెండు మూడు రోజుల్లో అనుమతులు రానున్నాయి. భూపాలపల్లిలో మొత్తం 13 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుండగా కేటీపీపీకి ఆరు వేల మెట్రిక్ టన్ను ల బొగ్గును సరఫరా చేస్తున్నారు. మరో రెండు వేల […]
BY Pragnadhar Reddy5 April 2015 3:05 AM IST
Pragnadhar Reddy Updated On: 5 April 2015 3:05 AM IST
మొదటిసారి భూపాలపల్లి కోల్‌బెల్ట్ నుంచి కర్ణాటక జెన్‌కోకు బొగ్గు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి, కర్ణాటక జెన్‌కో మధ్య అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉన్నప్పటికీ ట్రాన్స్‌పోర్టు కంపెనీల టెండర్లకు రెండు మూడు రోజుల్లో అనుమతులు రానున్నాయి. భూపాలపల్లిలో మొత్తం 13 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుండగా కేటీపీపీకి ఆరు వేల మెట్రిక్ టన్ను ల బొగ్గును సరఫరా చేస్తున్నారు. మరో రెండు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఇతర కంపెనీలకు విక్రయిస్తుండగా ఐదు వేల టన్నుల బొగ్గు ప్రతీ రోజు నిల్వ ఉంటుంది. ఈ నిల్వలను తగ్గించుకునే చర్యల్లో భాగంగా గడిచిన నాలుగైదు నెలలుగా సింగరేణి యాజమాన్యం బొగ్గు సరఫరాకు ఇతర రాష్ర్టాలపై దృష్టి సారించింది. దీంతో కర్ణాటకలోని రాయచూర్, పర్లీ థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసేందుకు కర్ణాటక జెన్‌కోతో పలుమార్లు చర్చలు జరిపి సాకారం చేసుకుంది. దీంతో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకునేందుకు కర్ణాటక జెన్‌కో ముందుకొచ్చింది. ట్రాన్స్‌పోర్టు కంపెనీల ఎంపికపై ఇపుడు కసరత్తు ప్రారంభించింది. భూపాలపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉప్పల్ వరకు బొగ్గును పంపించి అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా కర్ణాటకకు తరలించాలని సింగరేణి యోచిస్తోంది.-పీఆర్
Next Story