భూ సేకరణ చట్టాన్ని ఎన్నిసార్లయినా వ్యతిరేకిస్తాం: జైరాం
కేంద్రం పార్లమెంటులో ఎన్నిసార్లు భూ సేకరణ బిల్లును చర్చకు పెట్టినా తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిందని, దానికి బీజేపీ కూడా మద్దతిచ్చిందని, దాన్నే ఆమోదిస్తే తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని ఆయన అన్నారు. భూసేకరణ బిల్లును కాంగ్రెస్‌తోపాటు అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. భూసేకరణ బిల్లును టీఆర్ఎస్., టీడీపీ కూడా పార్లమెంటులో వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఇద్దరు నాయుళ్ళు తెలంగాణలోను, ఏపీలోను […]
BY Pragnadhar Reddy3 April 2015 10:32 AM IST
X
Pragnadhar Reddy Updated On: 3 April 2015 10:33 AM IST
కేంద్రం పార్లమెంటులో ఎన్నిసార్లు భూ సేకరణ బిల్లును చర్చకు పెట్టినా తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిందని, దానికి బీజేపీ కూడా మద్దతిచ్చిందని, దాన్నే ఆమోదిస్తే తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని ఆయన అన్నారు. భూసేకరణ బిల్లును కాంగ్రెస్‌తోపాటు అనేక పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. భూసేకరణ బిల్లును టీఆర్ఎస్., టీడీపీ కూడా పార్లమెంటులో వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఇద్దరు నాయుళ్ళు తెలంగాణలోను, ఏపీలోను ప్రజల్ని మోసం చేస్తున్నారని… నాయుడు పోలవరంపై మోసం చేస్తే… మరో నాయుడు ప్రత్యేక హోదా పేరుతో మోసం చేస్తున్నారని జైరాం ఆరోపించారు. పోలవరం విషయంలో తెలంగాణను చంద్రబాబు మోసం చేస్తే, ప్రత్యేక హోదా పేరుతో వెంకయ్యనాయుడు ఏపీ ప్రజలను వంచిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రాజధాని రైతులకు ఆశించిన పరిహారం ఇవ్వడం లేదని… అసలు దేశంలో ఏ రాజధానికి ఇంత భూమి సేకరించలేదని ఆయన అన్నారు. పట్టిసీమ కన్నా పోలవరానికే తమ ప్రాధాన్యత అని జైరాం చెప్పారు. పట్టిసీమ మొదలుపెడితే ఆ ప్రభావం పోలవరంపై పడుతుందని, ఇది మంచిది కాదని జైరాం రమేష్ అన్నారు. పోలవరం కావాలని బీజేపీతో సహా అన్ని పార్టీలూ కోరాయని… ఇపుడు దానికి ప్రాధాన్యతను తగ్గించి పట్టిసీమ వైపు మొగ్గడంలో అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలో వాటికే చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తున్నారని, స్వీయ ప్రచారానికి ఆయనిస్తున్న ప్రాధాన్యత అభివృద్ధి చేయడం మీద పెడితే ఆంధ్రప్రదేశ్ ఎంతగానో బాగుపడుతుందని జైరాం వ్యాఖ్యానించారు.-పీఆర్
Next Story