కేసీఆర్ పి.ఎ. కుటుంబానికీ సబ్సిడీ ట్రాక్టర్
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు పరమేశ్వర్‌రెడ్డి కుటుంబానికి సబ్సిడీ ట్రాక్టర్ మంజూరైనట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా నంగునూర్ మండలానికి చెందిన పరమేశ్వర్‌రెడ్డి తండ్రి… మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అయిన వేముల వెంకటరెడ్డికి… సుమారు రూ. 4.50 లక్షల సబ్సిడీతో ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ కుటుంబానికి దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మెదక్ జిల్లాకు 157 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. అర్హులైన రైతులకు వీటిని మంజూరు చేయాల్సిన జిల్లా యంత్రాంగం.. ఎమ్మెల్యేల సిఫారసుల మేరకు అనర్హులకు […]
BY Pragnadhar Reddy2 April 2015 11:00 PM GMT
Pragnadhar Reddy Updated On: 2 April 2015 9:29 PM GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు పరమేశ్వర్‌రెడ్డి కుటుంబానికి సబ్సిడీ ట్రాక్టర్ మంజూరైనట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా నంగునూర్ మండలానికి చెందిన పరమేశ్వర్‌రెడ్డి తండ్రి… మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అయిన వేముల వెంకటరెడ్డికి… సుమారు రూ. 4.50 లక్షల సబ్సిడీతో ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ కుటుంబానికి దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మెదక్ జిల్లాకు 157 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. అర్హులైన రైతులకు వీటిని మంజూరు చేయాల్సిన జిల్లా యంత్రాంగం.. ఎమ్మెల్యేల సిఫారసుల మేరకు అనర్హులకు కూడా కొన్ని చేరాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కాజేశారన్న ఆరోపణలున్నాయి… ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాత్రం కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఈ ట్రాక్టర్లను మంజూరు చేయడం గమనార్హం. మిగిలిన 9 నియోజకవర్గాలలోనూ అత్యధిక ట్రాక్టర్లను టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులే పొందారన్న విమర్శలున్నాయి.-పిఆర్
Next Story