శ్రీసిటీలో పెప్సీ కంపెనీ
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ పారిశ్రామిక వాడలో 1400 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 11 దేశ, విదేశీ పరిశ్రమలకు చంద్రబాబునాయుడు భూమి పూజ చేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పెప్సీకో సీఈఓ ఇంద్రనూయి ఏపీ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే త్వరత్వరగా అనుమతులు మంజూరు చేస్తున్నామని అన్నారు. తిరుపతి-నెల్లూరు మధ్య మరో హార్బర్ పెట్టి […]
BY Pragnadhar Reddy3 April 2015 10:36 AM IST
X
Pragnadhar Reddy Updated On: 3 April 2015 10:36 AM IST
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ పారిశ్రామిక వాడలో 1400 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 11 దేశ, విదేశీ పరిశ్రమలకు చంద్రబాబునాయుడు భూమి పూజ చేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పెప్సీకో సీఈఓ ఇంద్రనూయి ఏపీ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే త్వరత్వరగా అనుమతులు మంజూరు చేస్తున్నామని అన్నారు. తిరుపతి-నెల్లూరు మధ్య మరో హార్బర్ పెట్టి పారిశ్రామిక వాడగా తయారు చేస్తామని చెప్పారు. వ్యవసాయంతోపాటు పారిశ్రామికీకరణ జరిగితేనే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు అన్నారు.పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌పై యూనిట్‌కు ఒక రూపాయి చొప్పున సబ్సిడీ ఇస్తామని, పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ఓ అధికారిని నియమిస్తామని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలు స్థాపించే వారి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని, అనుమతుల కోసం రాష్ట్రంలోనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు. స్కిల్ డవ్‌లప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, స్టాంపు డ్యూటీ, పన్నుల మినహాయింపులపై నిర్ణయం తీసుకున్నామని… ఇవన్నీ పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేస్తున్నవేనని బాబు చెప్పారు. వచ్చే పదేళ్లలో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా శ్రీసిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సముద్ర తీరం ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు. శ్రీసిటీలో 1200 కోట్ల పెట్టుబడులు పెడతామని పెప్సీకో సీఈఓ ఇంద్రనూయి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. తొలిదశలో 550 కోట్ల పెట్టుబడితో తమ పరిశ్రమలను నెలకొల్పుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులపై మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని తెలిపారు.-పీఆర్
Next Story