ఇంటి గడపే.. పాముల పుట్ట!
ఓ ఇంట్లో ఏకంగా ఒకేసారి 50 పాములు బయటపడ్డాయి. వీటిని చూసినవాళ్లు నోరెళ్ల బెట్టారు. ఇన్ని పాములుండి ఏమీ అపకారం జరగకపోవడం నాగేంద్రుడి మహిమగా గ్రామస్తులు అనుకుంటున్నారు. ఎంతకాలం నుంచి ఈ పాములన్నీ ఇక్కడ తిష్ట వేశాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. మెదక్ జిల్లా సాదులనగర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే యజమాని ఇంట్లో ఏకంగా 50 పాములు బయటపడ్డాయి. ఆ ఇంటి గడపే పాములపుట్టగా మారిపోయింది. ఒకేసారి అన్ని బయటపడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకే ఇంట్లో 50 […]
BY Pragnadhar Reddy3 April 2015 10:39 AM IST

X
Pragnadhar Reddy Updated On: 3 April 2015 10:39 AM IST
ఓ ఇంట్లో ఏకంగా ఒకేసారి 50 పాములు బయటపడ్డాయి. వీటిని చూసినవాళ్లు నోరెళ్ల బెట్టారు. ఇన్ని పాములుండి ఏమీ అపకారం జరగకపోవడం నాగేంద్రుడి మహిమగా గ్రామస్తులు అనుకుంటున్నారు. ఎంతకాలం నుంచి ఈ పాములన్నీ ఇక్కడ తిష్ట వేశాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. మెదక్ జిల్లా సాదులనగర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే యజమాని ఇంట్లో ఏకంగా 50 పాములు బయటపడ్డాయి. ఆ ఇంటి గడపే పాములపుట్టగా మారిపోయింది. ఒకేసారి అన్ని బయటపడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకే ఇంట్లో 50 పాములను ఇప్పటివరకు చూడలేదంటున్నారు. ఇంటి యజమాని కృష్ణ కూతురు లావణ్య నిద్రపోగా, ఓ పాము ఆమె పక్కనే కనిపించింది. మొదట ఒక పాము కనిపించగా ఆ తర్వాత గడప దగ్గర తవ్విచూడడంతో మిగతా పాములు బయటపడ్డాయి. దీంతో ఆందోళన చెందిన ఆ ఫ్యామిలీ సభ్యులు ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో అందరూ వచ్చి పాములను పట్టుకున్నారు.-పీఆర్
Next Story