హైదరాబాద్‌లో ఉచితంగా వైఫై సేవలు?
హైదరాబాద్ నగరంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. నగరంలో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్ఎంసీ ప్రయత్నం చేస్తుంది. కనీసం మూడు గంటలపాటు ఉచితంగా వినియోగదారులకు వైఫై సేవలు అందించాలని భావిస్తున్నారు. ఇందిరాపార్క్, కేబీఆర్, సంజీవయ్యపార్కులతోపాటు రద్దీగావుండే వివిధ ప్రాంతాలను ఈ సదుపాయానికి ఎంపిక చేసినట్టు సమాచారం. మరి ఈ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయా..? లేక కొంతమందికేనా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. వైఫై ఏర్పాటు కోసం దాదాపు 200 కేంద్రాలను జీహెచ్ఎంసీ […]
BY Pragnadhar Reddy3 April 2015 8:26 AM IST
X
Pragnadhar Reddy Updated On: 3 April 2015 8:26 AM IST
హైదరాబాద్ నగరంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. నగరంలో ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్ఎంసీ ప్రయత్నం చేస్తుంది. కనీసం మూడు గంటలపాటు ఉచితంగా వినియోగదారులకు వైఫై సేవలు అందించాలని భావిస్తున్నారు. ఇందిరాపార్క్, కేబీఆర్, సంజీవయ్యపార్కులతోపాటు రద్దీగావుండే వివిధ ప్రాంతాలను ఈ సదుపాయానికి ఎంపిక చేసినట్టు సమాచారం. మరి ఈ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయా..? లేక కొంతమందికేనా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. వైఫై ఏర్పాటు కోసం దాదాపు 200 కేంద్రాలను జీహెచ్ఎంసీ అధికారులు ఎంపిక చేశారు. మెయిల్ లేదా ఫోన్ నెంబరులో జీహెచ్ఎంసీని సంప్రదించిన వారికే పాస్‌వర్డ్ అందుబాటులో ఉంటుందని, వారికి మాత్రమే ఈ సేవలు అందుతాయని తెలుస్తోంది. వైఫై సెంటర్ల వద్ద ఆ పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందడం మరింత సులభమవుతుంది. దీనిపై త్వరలోనే ఓ అధికార ప్రకటన వెలువడనుంది.-పీఆర్
Next Story