Telugu Global
NEWS

రాష్ట్రంలో పోలీసు రాజ్యం : భట్టి

ఖమ్మం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పోలీస్‌ రాజ్యాన్ని నడుపుతున్నారని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ద్వజమెత్తారు. సాగునీరు అడిగిన రైతులకు సంకెళ్లు వేసి జైల్లో నిర్బంధించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. తమ పొలాలకు సాగునీరందించాలని డిమాండ్‌ చేసిన బోనకల్‌ మండలం గోవిందాపురం రైతులను జైలుపాలు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సబ్‌జైలులో ఉన్న రైతులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా చికిత్స కోసం వారిని బేడీలతో ఆసుపత్రికి […]

రాష్ట్రంలో పోలీసు రాజ్యం : భట్టి
X
ఖమ్మం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పోలీస్‌ రాజ్యాన్ని నడుపుతున్నారని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ద్వజమెత్తారు. సాగునీరు అడిగిన రైతులకు సంకెళ్లు వేసి జైల్లో నిర్బంధించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. తమ పొలాలకు సాగునీరందించాలని డిమాండ్‌ చేసిన బోనకల్‌ మండలం గోవిందాపురం రైతులను జైలుపాలు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సబ్‌జైలులో ఉన్న రైతులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా చికిత్స కోసం వారిని బేడీలతో ఆసుపత్రికి తరలించడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. రైతులను బెదిరించి వేధిస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదని భట్టి హెచ్చరించారు. నిజాం పాలనలో భూస్వాములు, జమిందార్ల సహకారంతో ఏ విధంగా పీడించారో ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే పంథాలో పోలీస్‌ వ్యవస్థను ఉపయోగించి రైతులను పీడిస్తున్నారని ఆరోపించారు. రైతులకు సంకెళ్లు వేసేందుకు కారణమైన ఎన్నెస్పీ, పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.-పీఆర్‌
First Published:  3 April 2015 6:18 AM IST
Next Story