ఏది ప్రదర్శించవచ్చు...ఏది ప్రదర్శించకూడదు?
కోల్‌కతా లోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ ఇప్పటికే చైతన్యవంతమైన యువతరం ఉన్న విద్యాసంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేస్థాయిలో వివాదాలకూ గురయింది. తాజాగా లింగ వివక్షకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు శానిటరీ నేప్‌కిన్స్ మీద ప్రచారం చేస్తూ మరొకసారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం, అత్యాచార, లైంగిక వేధింపుల బాధితులకు సమాజం నుండి ఎదురవుతున్న సవాళ్లను నిరసిస్తూ రూపొందించిన నినాదాలను వారు నేప్‌కిన్లమీద రాసి యూనివర్శిటీలో అతికించారు. ఈ తరహా నిరసన ప్రదర్శనను మొట్టమొదట జర్మనీలో మహిళా దినోత్సవం రోజున ఎలోన్ కస్ట్రాషియా ప్రారంభించారు. దీనిపై […]
కోల్‌కతా లోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ ఇప్పటికే చైతన్యవంతమైన యువతరం ఉన్న విద్యాసంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేస్థాయిలో వివాదాలకూ గురయింది. తాజాగా లింగ వివక్షకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు శానిటరీ నేప్‌కిన్స్ మీద ప్రచారం చేస్తూ మరొకసారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం, అత్యాచార, లైంగిక వేధింపుల బాధితులకు సమాజం నుండి ఎదురవుతున్న సవాళ్లను నిరసిస్తూ రూపొందించిన నినాదాలను వారు నేప్‌కిన్లమీద రాసి యూనివర్శిటీలో అతికించారు. ఈ తరహా నిరసన ప్రదర్శనను మొట్టమొదట జర్మనీలో మహిళా దినోత్సవం రోజున ఎలోన్ కస్ట్రాషియా ప్రారంభించారు. దీనిపై స్పందించిన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆశిష్ స్వరూప్ వర్మ ఈ తరహా నిరసనను సమాజం ఆమోదించదంటున్నారు. తాను విద్యార్థుల ఉద్యమానికి వ్యతిరేకిని కాదంటూ ఏది ప్రదర్శించవచ్చో, ఏది ప్రదర్శించకూడదో మనకు తెలియాలి అన్నారు. ఈ పని చేసింది ఎవరో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన ఆగ్రహానికి స్పందించిన జాయ్ బెనర్జీ అనే విద్యార్థి దేన్ని సమాజం ఆమోదిస్తుంది, దేన్ని ఆమోదించదు…నేప్‌కిన్‌నా, రుతుక్రమాన్నా, లేదా మహిళనే ఆమోదించదా అంటూ ప్రశ్నించారు. ఈ ఉద్యమానికి ముందు నిలిచిన ఫిలాసఫీ సెకండ్ ఇయర్ విద్యార్థిని అమృతా మిత్రా అత్యాచార బాధితులపైనే విమర్శలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏది ఏమైనా స్త్రీల శరీరాన్ని సినిమాల్లో, వాణిజ్య ప్రకటనల్లో ఎన్నిరకాలుగా ప్రదర్శించినా అభ్యంతరం పెట్టని సమాజం శానిటరీ నేప్‌కిన్‌లను బహిరంగపరచడాన్ని మాత్రం అంగీకరించదని ఈ సందర్భం ద్వారా అర్థమైంది.