జర నవ్వండి ప్లీజ్ 25
స్వర్గం – నరకం అబ్బాయి: నీకు దూరంగా వుంటే నాకు నరకంలో వున్నట్లుంది అమ్మాయి: అది నిజమైతే నాకెంతో సంతోషంగా వుంటుంది. ************ తిండి ‘వెయిటర్! ఈ తిండి దరిద్రంగా వుంది. నేను తినలేను’ ‘నేను కూడా సార్’ ‘మేనేజర్‌ని పిలువు’ ‘లాభం లేదు సార్! అతను పక్క హోటల్లో తింటున్నాడు.’ ఎవరో ఒకరు ‘ఐలవ్‌యు! ఐ లవ్‌యు!’ వెంకట్ వినీల చెవిలో గుసగుసలు పోయాడు.వినీల మౌనంగా వుంది. వెంకట్ ‘త్వరగా బదులివ్వు లేకపోతే మరొకర్ని చూసుకుంటాను’ […]
స్వర్గం – నరకం
అబ్బాయి: నీకు దూరంగా వుంటే నాకు నరకంలో వున్నట్లుంది
అమ్మాయి: అది నిజమైతే నాకెంతో సంతోషంగా వుంటుంది.
************
తిండి
‘వెయిటర్! ఈ తిండి దరిద్రంగా వుంది. నేను తినలేను’
‘నేను కూడా సార్’
‘మేనేజర్‌ని పిలువు’
‘లాభం లేదు సార్! అతను పక్క హోటల్లో తింటున్నాడు.’
ఎవరో ఒకరు
‘ఐలవ్‌యు! ఐ లవ్‌యు!’ వెంకట్ వినీల చెవిలో గుసగుసలు పోయాడు.వినీల మౌనంగా వుంది.
వెంకట్ ‘త్వరగా బదులివ్వు లేకపోతే మరొకర్ని చూసుకుంటాను’ అన్నాడు
వినీల ‘ఇంత సడన్‌గానా’ అంది.
‘ఐతే ఈ విషయం మీ అమ్మగారితో చెప్పమంటావా?’
‘వద్దు వద్దు! ఇది నా సంగతి. మా అమ్మ దాకా ఎందుకు! అసలే మానాన్న లేడు’
************
రెడీ
‘ఆకలి వేస్తోంది! యింకా వంట కాలేదా? నేను హోటల్‌కు వెళుతున్నా’ అన్నాడు భర్త. ‘ఐదు నిముషాలు’ అంది భార్య
‘ఐదు నిముషాల్లో వంటవుతుందా?’
‘కాదు. రెడీ ఐ నేనూ హోటల్‌కు వస్తాను’ అంది భార్య.
************
సందేహం
‘నాన్నా! అమ్మలో ఏంచూసి పెళ్ళాడావు!’ అడిగాడు కొడుకు.
‘ఐతే నీక్కూడా సందేహం మొదలయిందన్నమాట’ అన్నాడు తండ్రి.