సూర్యాపేటలో కాల్పులు... సీఐ పరిస్థితి సీరియస్
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి కాల్పులు జరిపింది యూపీ, బీహార్‌కు చెందిన దొంగల ముఠాల పని కావచ్చని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. బస్సుల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 15 రోజుల క్రితం యూపీకి చెందిన దొంగ ఇర్ఫాన్‌ను సీఐ మొగిలయ్య అరెస్ట్ చేశారు. అతనికి చెందిన ముఠాలే ఈ దాడి చేసి ఉంటాయన్న కోణంలో కూడా […]
BY Pragnadhar Reddy2 April 2015 6:35 AM IST
Pragnadhar Reddy Updated On: 2 April 2015 6:35 AM IST
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి కాల్పులు జరిపింది యూపీ, బీహార్‌కు చెందిన దొంగల ముఠాల పని కావచ్చని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. బస్సుల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 15 రోజుల క్రితం యూపీకి చెందిన దొంగ ఇర్ఫాన్‌ను సీఐ మొగిలయ్య అరెస్ట్ చేశారు. అతనికి చెందిన ముఠాలే ఈ దాడి చేసి ఉంటాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో నక్సలైట్లను అనుమానించాల్సిన అవసరం ఉన్నట్టు కనిపించడం లేదని డీజీపీ అన్నారు. గత కొంతకాలంగా యూపీ, బీహార్‌కు చెందిన దొంగల ముఠాలు నల్గొండ జిల్లాలో తిరుగుతున్నట్టు తమకు సమాచారం ఉందని తెలిపారు. అర్ధరాత్రి కాల్పులు జరిపిన దుండగులు పారిపోయే ప్రయత్నంలో ఓ కారును ఆపడానికి యత్నించారని, వారు సహకరించకపోయేసరికి ఆ కారుపై కూడా కాల్పులు జరపగా అందులో ఉన్న దొరబాబు అనే వ్యక్తి కూడా గాయపడ్డారని, ఆ కారులో భార్యతోపాటు హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్నారని డీజీపీ చెప్పారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీఐ మొగిలయ్య, మరో కానిస్టేబుల్‌కు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని, మొగిలయ్య శరీరంలో ఇంకా రెండు బుల్లెట్‌లు ఉన్నాయని, ఒకటి ఛాతీలోను, మరొకటి వెన్నుముకను అనుకుని ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారని, ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. మరో కానిస్టేబుల్‌కు, దొరబాబు అనే వ్యక్తికి కూడా చికిత్స జరుగుతుందని అన్నారు.-పిఆర్
Next Story