గుంటూరు జిల్లాలో బాంబు పేలుడు
గుంటూరు: గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కాని అసలు బాంబు పేలడానికి కారణాలేమిటన్న విషయం ఇపుడు చర్చనీయాంశమైంది. పేలిన బాంబు ఓ గడ్డివాములో దాచి ఉంచినట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఈ బాంబు పేలినట్టు స్థానికులు చెబుతున్నారు. అసలు ఈ బాంబు ఎందుకు గడ్డివాములో పెట్టి ఉంటారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరినైనా హత్య చేయడానికి ఉపయోగించే ఉద్దేశ్యంతో దీన్ని ఇక్కడ […]
BY Pragnadhar Reddy2 April 2015 11:47 AM
Pragnadhar Reddy Updated On: 2 April 2015 11:47 AM
గుంటూరు: గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కాని అసలు బాంబు పేలడానికి కారణాలేమిటన్న విషయం ఇపుడు చర్చనీయాంశమైంది. పేలిన బాంబు ఓ గడ్డివాములో దాచి ఉంచినట్టు తెలుస్తోంది. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఈ బాంబు పేలినట్టు స్థానికులు చెబుతున్నారు. అసలు ఈ బాంబు ఎందుకు గడ్డివాములో పెట్టి ఉంటారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరినైనా హత్య చేయడానికి ఉపయోగించే ఉద్దేశ్యంతో దీన్ని ఇక్కడ పెట్టారా? ఇదొక్కటే కాకుండా ఇంకా బాంబులుండే అవకాశం ఉందా అనే అనుమానాలతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు తెలవాల్సి ఉంది.-పీఆర్
Next Story