Telugu Global
NEWS

ఏపీ నుంచి తెలంగాణకు ప్రైవేట్ బస్సులు బంద్

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల మీద మంగళవారం అర్ధరాత్రి నుంచి పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ప్రైవేట్ బస్సుల రాక‌పోక‌ల‌ను నిలిపివేయాలని ప్ర‌యివేటు ఆప‌రేట‌ర్లు నిర్ణయించారు. దాంతో మంగళవారం రాత్రి నుంచి 80 శాతం ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు తమ బస్సులకు ముందస్తు రిజర్వేషన్‌ని ఇప్పటికే నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మీడియా సమావేశం నిర్వహించి ఏపీ […]

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల మీద మంగళవారం అర్ధరాత్రి నుంచి పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ప్రైవేట్ బస్సుల రాక‌పోక‌ల‌ను నిలిపివేయాలని ప్ర‌యివేటు ఆప‌రేట‌ర్లు నిర్ణయించారు. దాంతో మంగళవారం రాత్రి నుంచి 80 శాతం ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు తమ బస్సులకు ముందస్తు రిజర్వేషన్‌ని ఇప్పటికే నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మీడియా సమావేశం నిర్వహించి ఏపీ వాహనాల మీద పన్ను విధించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. దీనివల్ల రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడతారని, ధరలు పెరుగుతాయని ఆయన చెప్పారు.
మార్చి 31వ తేదీతో ఉమ్మడి రవాణా పన్ను విధానానికి కాలం చెల్లింది. దీంతో నేటితో అమలులోకి రానున్న జీవో ప్రకారం ఏపీ లోంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలన్నీ ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి వుంటుంది. ఈ ఫీజుల రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి నెలకు రూ.40 కోట్ల ఆదాయం రానుంది. అయితే తెలంగాణలోంచి ఆంధ్రాలోకి ప్రవేశించే వాహనాలకు ఎటువంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయబోమని ఏపీ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవయ్య స్పష్టంచేశారు. తెలంగాణ కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇదిలా వుండగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దారుణమని, ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కి ఏపీ వాహనాలు వస్తే పన్ను వేయాలని నిర్ణయించడం దారుణమని సీపీఐ పార్టీ నాయకులు విమ‌ర్శించారు. ఈ విషయం మీద కోర్టును ఆశ్రయిస్తామని ప్రైవేట్ వాహనాల యజమానులు చెప్పారు.-పిఆర్‌
First Published:  31 March 2015 6:52 PM IST
Next Story