కేసీఆర్.. నయా నిజాం: మావోయిస్టుల వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై సీపీఐ మావోయిస్టు పార్టీ నిప్పులు చెరిగింది. ఆయనను నయా నిజాంగా దుయ్యబట్టింది. ‘మావోయిస్టు పార్టీ అజెండాయే మా అజెండా’ అని అధికారంలోకి రావడానికి ముందు ప్రకటించిన కేసీఆర్… ఆ తర్వాత. బ్యూరోక్రటిక్ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించింది. కరీంనగర్- – వరంగల్ సరిహద్దులోని ఓ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్లీనరీ జరిగింది. దీనికి దాదాపు రెండొందల మంది నక్సల్స్ హాజరయ్యారు. ప్రభుత్వం ఆట…పాట… మాటలను నియంత్రిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తుందని ధ్వజమెత్తింది. […]
BY admin1 April 2015 6:48 AM IST
admin Updated On: 1 April 2015 6:48 AM IST
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై సీపీఐ మావోయిస్టు పార్టీ నిప్పులు చెరిగింది. ఆయనను నయా నిజాంగా దుయ్యబట్టింది. ‘మావోయిస్టు పార్టీ అజెండాయే మా అజెండా’ అని అధికారంలోకి రావడానికి ముందు ప్రకటించిన కేసీఆర్… ఆ తర్వాత. బ్యూరోక్రటిక్ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించింది. కరీంనగర్- – వరంగల్ సరిహద్దులోని ఓ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్లీనరీ జరిగింది. దీనికి దాదాపు రెండొందల మంది నక్సల్స్ హాజరయ్యారు. ప్రభుత్వం ఆట…పాట… మాటలను నియంత్రిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తుందని ధ్వజమెత్తింది. తానే పెద్ద నక్సలైట్‌గా అభివర్ణించుకున్న కేసీఆర్ రంగు బయట పడిందని వ్యాఖ్యానించింది. సమైక్య రాష్ట్రంలో కన్నా మూడు రెట్ల ఆత్మహత్యలు ఒక్క తెలంగాణలో మాత్రమే నమోదయ్యాయని… కేసీఆర్ పాలనకు ఇదొక మంచి ఉదాహరణని వ్యాఖ్యానించింది. వేగంగా ఆదివాసీలను నిర్మూలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఏం చేస్తున్నారో కూడా గమనిస్తున్నామని హెచ్చరించింది. తెలంగాణ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు, ప్రజాస్వామికవాదులు సమరశీలంగా ఉద్యమించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి ప్లీనరీని మావోయిస్టులు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతు ఆత్మహత్యలు తదితర అంశాలపై ‘ప్లీనరీ’ లోతుగా దృష్టి సారించింది. తక్షణ ప్రజాసమస్యలను అంచనా వేస్తూ, దీర్ఘకాల దృష్టితో ఉద్యమ కార్యాచరణ, సాయుధపోరాట నిర్మాణంపై దృష్టి కేంద్రీకరిస్తూ.. ప్లీనరీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పది నెలల తెలంగాణ ప్రభుత్వం తీరుతెన్నులపై ప్రత్యేకంగా ఒక తీర్మానం ఆమోదించారు. ఈ పది నెలల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఇందులో చర్చించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఈ వివరాలను ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ వార్తా మాధ్యమాలకు విడుదల చేశారు.-పిఆర్
Next Story