జర నవ్వండి ప్లీజ్ 23
జాగ్రత్త సుధీర్ తలమీద పది వెంట్రుకలుంటా యేమో. అతను మాటి మాటికీ దువ్వెన తీసి దువ్వుకుంటూ వుంటే రమేష్ ‘వున్న పదివెంట్రు కల్ని అన్ని సార్లు పరామర్శించాలా?’ అన్నాడు సుధీర్ ‘వెయ్యి రూపాయలున్న వాడు ముందు వెనకా చూడకుండా ఖర్చు పెట్టొచ్చు. పదిరూపాయలున్నవాడు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా!’ అన్నాడు. ************ అమరప్రేమ ‘మరణం లేని ప్రేమంటే నీకు తెలుసా?’ ‘నాకు తప్ప ఎవరికీ తెలీదని నా నమ్మకం’ ‘అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు? ‘ఇప్పటికే నా […]
జాగ్రత్త
సుధీర్ తలమీద పది వెంట్రుకలుంటా యేమో. అతను మాటి మాటికీ దువ్వెన తీసి దువ్వుకుంటూ వుంటే
రమేష్ ‘వున్న పదివెంట్రు కల్ని అన్ని సార్లు పరామర్శించాలా?’ అన్నాడు
సుధీర్ ‘వెయ్యి రూపాయలున్న వాడు ముందు వెనకా చూడకుండా ఖర్చు పెట్టొచ్చు. పదిరూపాయలున్నవాడు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా!’ అన్నాడు.
************
అమరప్రేమ
‘మరణం లేని ప్రేమంటే నీకు తెలుసా?’
‘నాకు తప్ప ఎవరికీ తెలీదని నా నమ్మకం’
‘అంత నమ్మకంగా ఎలా చెబుతున్నావు?
‘ఇప్పటికే నా దగ్గర ఎందరో రాసిన వందల వుత్తరాలు. ఐదు ఎంగేజ్‌మెంట్ రింగ్స్ వున్నాయి’
************
పెళ్ళి
‘రాము, రాధ పెళ్ళి చేసుకోబోతున్నారు తెలుసా?’
‘అవునా! రాధ గురించి విన్నాను. ఆమెవి ఆధునిక భావాలని అమెకు పెళ్ళి అంటే నమ్మకం లేదని విన్నాను’
‘అవును. రామువి కూడా ఆధునిక భావాలే. అతనిక్కూడా పెళ్ళంటే నమ్మకం లేదు. ‘ఇద్దరి భావాలూ కలిశాయి. అందుకే పెళ్ళి చేసుకుంటున్నారు!’
************
రహస్యం
వాణి తన ఎంగేజ్‌మెంట్‌ని సీక్రెట్‌గా పెట్టింది తెలుసా?!
‘ఆ సంగతి నీకెలా తెలిసింది’
‘వాణి ఆవిషయం నాతో చెప్పింది!’