Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 22

గతం ‘ఎందుకు మీరు దిగులుగా కనిపిస్తున్నారు?’ ‘నా భవిష్యత్తు గురించి’ ‘మీ భవిష్యత్తు గురించి దిగులుపడడానికి కారణం?’ ‘నా గతం!’ ************* బూట్‌పాలిష్‌ ‘ఏం చేస్తున్నావు?’ ‘కనిపించడంలేదా? బూట్లు పాలిష్‌ చేస్తున్నా’ ‘ఏమిటి నీ బూట్లు నువ్వే పాలిష్‌ చేస్తావా?’ ‘అవును. మరి నువ్వు వేరే వాళ్ల బూట్లు పాలిష్‌ చేస్తావా?!’ ************* కరాటే వీరుడు రవి: రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారన్నావ్‌. ఐనా నీకు కరాటేలో బ్లాక్‌ బెల్టు కదా! వాళ్ళని దుమ్ము లేపకపోయావా! చితక […]

గతం
‘ఎందుకు మీరు దిగులుగా కనిపిస్తున్నారు?’
‘నా భవిష్యత్తు గురించి’
‘మీ భవిష్యత్తు గురించి దిగులుపడడానికి కారణం?’
‘నా గతం!’
*************
బూట్‌పాలిష్‌
‘ఏం చేస్తున్నావు?’
‘కనిపించడంలేదా? బూట్లు పాలిష్‌ చేస్తున్నా’
‘ఏమిటి నీ బూట్లు నువ్వే పాలిష్‌ చేస్తావా?’
‘అవును. మరి నువ్వు వేరే వాళ్ల బూట్లు పాలిష్‌ చేస్తావా?!’
*************
కరాటే వీరుడు
రవి: రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారన్నావ్‌. ఐనా నీకు కరాటేలో బ్లాక్‌ బెల్టు కదా! వాళ్ళని దుమ్ము లేపకపోయావా! చితక గొట్ట లేకపోయావా!
రాజు: నేను గదిలోకి వెళ్ళి కరాటే డ్రెస్సు వేసుకుని బెల్టు తగిలించుకుని వచ్చేసరికి పిరికి పందలు పారిపోయారు.
************
వయసు మహిమ
‘మనకు పక్క గదిలో పాతిక మంది ఆడవాళ్ళున్నారు. తెగమాట్లాడుతున్నారు. వాళ్ళని పది నిముషాలు మాట్లాడకుండా మౌనంగా వుండేలా చెయ్యగలవా!’ అన్నాడు వేణు.
శేఖర్‌ ‘అదెంతపని?’ అని ఆడవాళ్ళ గదిలోకి వెళ్ళి వచ్చాడు. అంతా నిశ్శబ్దం. వేణు ఆశ్చర్యపోయాడు. ‘ఏం చేశావు?’ అన్నాడు శేఖర్‌ ‘వాళ్ళ మధ్యకు వెళ్ళి మీలో అందరికన్నా ఎక్కువ వయసు వాళ్ళు పదినిమిషాలు మాట్లాడండి అన్నాను’ అన్నాడు.

First Published:  1 April 2015 12:30 AM IST
Next Story