జేసీ మీద చంద్రబాబు ఆగ్రహం
అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరంలోని పులివెందుల బ్రాంచి కెనాల్‌కి స్థానిక రైతులతో కలసి జేసీ దివాకరరెడ్డి గండి కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై కడప జిల్లా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి జేసీ వైఖరిని దుయ్యబట్టారు. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఇవన్నీ తెలియడంతో చాలా ఆగ్రహంగా ఉన్నారని […]
BY admin31 March 2015 6:41 PM IST
X
admin Updated On: 31 March 2015 6:42 PM IST
అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరంలోని పులివెందుల బ్రాంచి కెనాల్‌కి స్థానిక రైతులతో కలసి జేసీ దివాకరరెడ్డి గండి కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై కడప జిల్లా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి జేసీ వైఖరిని దుయ్యబట్టారు. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఇవన్నీ తెలియడంతో చాలా ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనను కలవాలని జేసీని ఆదేశించారు. అన్ని ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు కడుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఎవరూ వ్యవహరించినా సహించేది లేదని చంద్రబాబు అన్నట్టు తెలిసింది. ఇదిలా వుండగా, జేసీ గండి కొట్టిన ప్రాంతానికి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంగళవారం వెళ్ళి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది కూడా. ఈ విషయాలన్నీ తెలుసుకున్న చంద్రబాబు జేసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.-పిఆర్
Next Story