ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్‌లో దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ సమావేశంలోనే పారిశ్రామిక విధానానికి తుది రూపు ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారికి అనేక రాయితీలను ప్రకటించారు. వ్యవసాయం, అగ్రిటెక్, బయోటెక్ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించిన వారికి నిరంతర విద్యుత్, నీరు […]
BY admin1 April 2015 10:56 AM IST
admin Updated On: 1 April 2015 12:05 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్‌లో దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ సమావేశంలోనే పారిశ్రామిక విధానానికి తుది రూపు ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారికి అనేక రాయితీలను ప్రకటించారు. వ్యవసాయం, అగ్రిటెక్, బయోటెక్ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించిన వారికి నిరంతర విద్యుత్, నీరు సరఫరా ఉండేలా చూడాలని, ఐదేళ్ళపాటు వ్యాట్, జీఎస్‌టీ పన్నులను రీఇంబర్స్ చేయాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మహిళ పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది.రూ. 10 లక్షలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, 99 సంవత్సరాలపాటు భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. పరిశ్రమలకు వి.ఎస్.టి., జి.ఎస్.టి.లను సడలించాలని నిర్ణయం తీసుకుంది.
Next Story