Telugu Global
National

మ‌ద్యంపై దేశ‌వ్యాప్త ఉద్య‌మానికి స్వామి అగ్నివేశ్ పిలుపు

మద్యం, మత్తు పదార్థాల వల్ల లక్షలాది కుటుంబాలు నాశానమవుతున్నాయని సామాజిక ఉద్యమ నేత స్వామి అగ్నివేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్య మం చేపడుతున్నట్లు ఆయ‌న తెలిపారు. రాజకీయలకు అతీతంగా చేపట్టే ఈ ఉద్యమంలో మత గురువులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, పౌర సంఘాలు భాగస్వాములవుతాయని ఆయన వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోని బ‌షీర్‌బాగ్‌ ప్రెస్‌క్ల‌బ్‌లో మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ, అప్పా సంయుక్త ఆధ్వర్యంలో మద్య నియంత్రణ, బెల్టు షాపుల […]

మద్యం, మత్తు పదార్థాల వల్ల లక్షలాది కుటుంబాలు నాశానమవుతున్నాయని సామాజిక ఉద్యమ నేత స్వామి అగ్నివేశ్‌ ఆవేదన
వ్యక్తం చేశారు. వీటిని పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్య మం చేపడుతున్నట్లు ఆయ‌న తెలిపారు.
రాజకీయలకు అతీతంగా చేపట్టే ఈ ఉద్యమంలో మత గురువులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, పౌర సంఘాలు భాగస్వాములవుతాయని
ఆయన వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోని బ‌షీర్‌బాగ్‌ ప్రెస్‌క్ల‌బ్‌లో మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ, అప్పా సంయుక్త ఆధ్వర్యంలో మద్య
నియంత్రణ, బెల్టు షాపుల నిర్మూలనపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మద్య నిషేధంపై కేంద్రం జాతీయ స్థాయిలో ప్రత్యేక
పాలసీని రూపొందించాలని డిమాండ్‌ చేశారు.-పిఆర్‌
First Published:  30 March 2015 8:09 PM GMT
Next Story