Telugu Global
National

ఢిల్లీలో మాజీ ప్ర‌ధాని పీవీకి స్మార‌క స్థూపం

మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత పీవీ నరసింహారావు స్మార‌క స్థూపం ఏర్పాటు చేయ‌నుంది కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం. ఈ డిమాండు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నా ఆయ‌న సేవ‌లు ఉప‌యోగించుకున్న కాంగ్రెస్ నాయకత్వం మాత్రం దీన్ని పట్టించుకోలేదు. పీవీకి స్మారక  చిహ్నంగా ఓ ఘాట్‌ను ఏర్పాటు చేయబోతున్న‌ట్టు ఎన్డీయే నాయకులు చెబుతున్నారు. దీన్ని ఢిల్లీలో ఏక్తా స్థల్ వద్ద ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. 1991 ప్రాంతంలో దేశ ప్రధానిగా […]

ఢిల్లీలో మాజీ ప్ర‌ధాని పీవీకి స్మార‌క స్థూపం
X
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత పీవీ నరసింహారావు స్మార‌క స్థూపం ఏర్పాటు చేయ‌నుంది కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం. ఈ డిమాండు చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నా ఆయ‌న సేవ‌లు ఉప‌యోగించుకున్న కాంగ్రెస్ నాయకత్వం మాత్రం దీన్ని పట్టించుకోలేదు. పీవీకి స్మారక చిహ్నంగా ఓ ఘాట్‌ను ఏర్పాటు చేయబోతున్న‌ట్టు ఎన్డీయే నాయకులు చెబుతున్నారు. దీన్ని ఢిల్లీలో ఏక్తా స్థల్ వద్ద ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. 1991 ప్రాంతంలో దేశ ప్రధానిగా పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఉత్పాదక రంగంపై దృష్టి నిలిపి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేశారు. కేవలం 18 పరిశ్రమలను లైసెన్సింగ్ పరిధిలోకి తెచ్చారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఏక్తా స్థల్ సమాధి కాంప్లెక్స్ వద్ద పీవీ మెమోరియల్ ఘాట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రతిపాదన తెచ్చిందని, దానిని కేబినెట్ ఆమోదానికి పంపనుందని తెలిసింది. ఆ స్థలం స‌మీపంలోనే కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి దివంగత జ్ఞానీ జైల్ సింగ్ స్మారక ఘాట్ కూడా ఉంది. తెలంగాణకు చెందిన పీవీకి ఓ స్మార‌క చిహ్నాన్ని ఏర్పాటు చేయాల‌ని లోగడ కేంద్రాన్ని కోరుతూ టీడీపీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.-పిఆర్‌
First Published:  31 March 2015 12:58 PM GMT
Next Story