Telugu Global
NEWS

పులివెందుల బ్రాంచి కెనాల్‌కు గండి

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం దగ్గర అనంతపురం ఎపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు పులివెందుల బ్రాంచి కెనాల్‌కు గండి కొట్టారు. తాగునీటి అవసరాల కోసమే నీటిని మళ్లిస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి త‌ను చేసిన ప‌నిని స‌మ‌ర్థించుకున్నారు. కెనాల్‌కు గండి కొట్టి నీటి మళ్ళించ‌డాన్ని ఓ వ‌ర్గం రైతులు అడ్డుకుంటూ నిర‌స‌న తెలిపారు. అయినా జేసీ వెన‌క్కి త‌గ్గ‌లేదు. జేసీ తీరుపై మాజీఎంపీ వైఎస్‌ వివేకా ఆగ్రహం పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు […]

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం దగ్గర అనంతపురం ఎపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు పులివెందుల బ్రాంచి కెనాల్‌కు గండి కొట్టారు. తాగునీటి అవసరాల కోసమే నీటిని మళ్లిస్తున్నామని ఈ సందర్భంగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి త‌ను చేసిన ప‌నిని స‌మ‌ర్థించుకున్నారు. కెనాల్‌కు గండి కొట్టి నీటి మళ్ళించ‌డాన్ని ఓ వ‌ర్గం రైతులు అడ్డుకుంటూ నిర‌స‌న తెలిపారు. అయినా జేసీ వెన‌క్కి త‌గ్గ‌లేదు.
జేసీ తీరుపై మాజీఎంపీ వైఎస్‌ వివేకా ఆగ్రహం
పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు గండి కొట్టి, నీరు మళ్లించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల బ్రాంచి కెనాల్‌కు గండి కొట్టిన ఎంపీ తీరును నిరసిస్తూ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లా రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితులేర్ప‌డ్డాయి. ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన‌ ఎంపీగా ఉన్న జేసీ రౌడీలా వేరొక‌రికి చెందాల్సిన నీటిని దోపిడీ చేయ‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించారు.-పిఆర్‌
First Published:  31 March 2015 9:00 AM IST
Next Story