Telugu Global
NEWS

దాసరి ఆస్తులు జప్తు

దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) జప్తు చేసింది. దాసరి నారాయణరావుకి సంబంధించిన‌ సౌభాగ్య మీడియా లిమిటెడ్‌కి చెందిన 2.25 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్న‌న‌సమయంలో దాసరి నారాయణరావుపై అవినీతిక ఆరోపణలు వ‌చ్చిన‌ విషయం తెలిసిందే.  జిందాల్ గ్రూపుకు కొన్ని బొగ్గు గ‌నులు కేటాయించేలా వ్య‌వ‌హ‌రించి దానికి ప్ర‌తిఫ‌లంగా వారి నుంచి త‌న‌కు చెందిన సౌభాగ్య మీడియాకు పెట్టుబ‌డుల […]

దాసరి ఆస్తులు జప్తు
X
దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) జప్తు చేసింది. దాసరి నారాయణరావుకి సంబంధించిన‌ సౌభాగ్య మీడియా లిమిటెడ్‌కి చెందిన 2.25 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్న‌న‌సమయంలో దాసరి నారాయణరావుపై అవినీతిక ఆరోపణలు వ‌చ్చిన‌ విషయం తెలిసిందే. జిందాల్ గ్రూపుకు కొన్ని బొగ్గు గ‌నులు కేటాయించేలా వ్య‌వ‌హ‌రించి దానికి ప్ర‌తిఫ‌లంగా వారి నుంచి త‌న‌కు చెందిన సౌభాగ్య మీడియాకు పెట్టుబ‌డుల రూపంలో రూ. 2.25 కోట్లు రాబ‌ట్టుకున్నందుకు దాస‌రిపై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు గతంలోనే అనేక‌సార్లు దాసరిని ప్రశ్నించారు. తాజాగా అధికారులు ఆస్తులు జప్తు చేశారు. ఈ ఆస్తుల్లో 50 లక్షల రూపాయల నగదు, రెండు లగ్జరీ వాహనాలు, ఇల్లు ఉన్నట్టు తెలిసింది. అయితే సౌభాగ్య మీడియాలో తాను 2008-2011 మధ్య కాలంలో మాత్రమే డైరెక్టర్‌గా ఉన్నాన‌ని,. సిబిఐ, ఈడి ఆరోపిస్తున్న డబ్బుల లావాదేవీలు ఆ తర్వాత కాలంలో జరిగాయని దాస‌రి చెబుతున్నారు. -పిఆర్‌
First Published:  31 March 2015 9:05 AM IST
Next Story