కడియం, కేసీఆర్‌లు టీడీపీ వారసులే
వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్, కడియం శ్రీహరి లాంటి వారు సైతం టీడీపీ ద్వారానే రాజకీయంగా ఎదిగారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు గుర్తు చేశారు. అలాంటివారు ఇపుడు తెలుగుదేశం ఆశయాలను తుంగలో తొక్కి బడుగు, బలహీనవర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తూ అమలుకు సాధ్యం కాని వాగ్ధానాలు చేస్తూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని ఎన్జీఆర్ విగ్రహానికి పార్టీ నేతల పూలమాలలు వేసి వాళులర్పించారు. అనంతరం ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ […]
BY Pragnadhar Reddy31 March 2015 1:49 AM IST
X
Pragnadhar Reddy Updated On: 31 March 2015 1:49 AM IST
వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్, కడియం శ్రీహరి లాంటి వారు సైతం టీడీపీ ద్వారానే రాజకీయంగా ఎదిగారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు గుర్తు చేశారు. అలాంటివారు ఇపుడు తెలుగుదేశం ఆశయాలను తుంగలో తొక్కి బడుగు, బలహీనవర్గాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తూ అమలుకు సాధ్యం కాని వాగ్ధానాలు చేస్తూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని ఎన్జీఆర్ విగ్రహానికి పార్టీ నేతల పూలమాలలు వేసి వాళులర్పించారు. అనంతరం ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీ.ఆర్.ఎస్.కు చెంప పెట్టులాంటివన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే టీడీపీ, కాంగ్రెస్ నాయకులను తిరిగి వారి పార్టీల్లోకి పంపించి ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ విసిరారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలైన బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించారన్నారు. తమ పార్టీలో ఉన్నప్పుడు ఈ సిద్ధాంతాలను వంటబట్టించుకున్న కేసీఆర్, కడియం ఇపుడు టీ.ఆర్.ఎస్. ద్వారా ఆ సిద్దాంతాలను తుంగలో తొక్కేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు.-పిఆర్
Next Story