సినిమా స్టామినానే భయపెడుతున్న బాహుబలి
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 కోట్ల మంది జనాభా ఉన్నా , సినిమా చూసేవాళ్ళు కనీసం కోటి మంది అయినా ఉండరు. సగటున ఓ సినిమా టిక్కెట్టు 50 రూపాయిలు వేసుకున్నా , ప్రతి సినిమా ఆ లెక్కన 50 కోట్లు దాటాలి. కాని ఇంతవరకూ ఆ రికార్డు సాధించిన సినిమాలు చాలా తక్కువ. అత్తారింటికి దారేది – 70-80 కోట్ల మధ్య గబ్బర్ సింగ్ – 60 కోట్ల వరకూ దూకుడు -55 కోట్ల పైన […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 కోట్ల మంది జనాభా ఉన్నా , సినిమా చూసేవాళ్ళు కనీసం కోటి మంది అయినా ఉండరు. సగటున ఓ సినిమా టిక్కెట్టు 50 రూపాయిలు వేసుకున్నా , ప్రతి సినిమా ఆ లెక్కన 50 కోట్లు దాటాలి. కాని ఇంతవరకూ ఆ రికార్డు సాధించిన సినిమాలు చాలా తక్కువ.
అత్తారింటికి దారేది – 70-80 కోట్ల మధ్య
గబ్బర్ సింగ్ – 60 కోట్ల వరకూ
దూకుడు -55 కోట్ల పైన
రేసుగుర్రం – 55 కోట్ల వరకూ
మిర్చి – 50 కోట్లు
మగధీర-45-50 మధ్య
మిగిలిన సినిమాలు ఎంత సూపర్ హిట్ అయినా , 40 కోట్లు దాటడం కష్టం.ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి ప్రభాస్ హీరోగా , అనుష్క హీరోయిన్ గా 170-200 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన బాహుబలి చిత్రం రెండు భాగాల్లో ఫస్ట్ పార్ట్ విడుదలకు సిద్దమవుతుంది. అంటే ఒకో భాగాన్ని 80 నుంచి 100 కోట్ల వరకు కొనాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు మెలిక ఉంది. బ్లాక్ బస్టర్ సినిమానే 70 కోట్లు కలెక్ట్ చేస్తే , బాహుబలి సినిమాని అంతకు మించి కొనాల్సి వస్తుంది. బయ్యర్స్ ఈ విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారు. ఆ సినిమా కనీవినీ ఎరుగని ఘనవిజయం సాధించాలి. లేని పక్షంలో బయ్యర్లు భారీగా నష్టపోవడమే కాకుండా , పార్ట్ 2 మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ సూపర్ డూపర్ హిట్ అయినా , లాభం మిగిలే ఛాన్స్ తక్కువ. నిర్మాతలు ఎంతో కొంత నష్టాని కి అమ్మాల్సి వస్తుంది. లేదా సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వస్లుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.