Telugu Global
National

మీ వంట‌ గ్యాసుకు బీమా ధీమా! పేలుడు సంభ‌విస్తే రూ.50 లక్షలు

మీరు ఎల్‌పీజీ వినియోగదారులా!? మీ గ్యాస్ క‌నెక్ష‌న్‌కు మీకు తెలియ‌కుండానే భీమా చెల్లిస్తున్న విష‌యం మీకు తెలుసా? అనుకోని ఆప‌ద సంభ‌విస్తే మీరు ప్రీమియం క‌ట్ట‌క‌పోయినా ఆదుకోవ‌డానికి ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అండ‌గా ఉంటుంద‌న్న విష‌యం మీకు తెలుసా? మీకే కాదు.. చాలామందికి ఈ విషయం తెలియదు. కానీ, ఇది నిజంగా నూటికి నూరు శాతం నిజం. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు జరిగినప్పుడు బాధితులు గ్యాస్‌ కంపెనీల నుంచి పరిహారం పొందవచ్చు. ఇది ఒక్కొక్క ప్రమాదానికి మృ […]

మీ వంట‌ గ్యాసుకు బీమా ధీమా! పేలుడు సంభ‌విస్తే రూ.50 లక్షలు
X
మీరు ఎల్‌పీజీ వినియోగదారులా!? మీ గ్యాస్ క‌నెక్ష‌న్‌కు మీకు తెలియ‌కుండానే భీమా చెల్లిస్తున్న విష‌యం మీకు తెలుసా? అనుకోని ఆప‌ద సంభ‌విస్తే మీరు ప్రీమియం క‌ట్ట‌క‌పోయినా ఆదుకోవ‌డానికి ఇన్సూరెన్స్ కంపెనీ మీకు అండ‌గా ఉంటుంద‌న్న విష‌యం మీకు తెలుసా? మీకే కాదు.. చాలామందికి ఈ విషయం తెలియదు. కానీ, ఇది నిజంగా నూటికి నూరు శాతం నిజం. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు జరిగినప్పుడు బాధితులు గ్యాస్‌ కంపెనీల నుంచి పరిహారం పొందవచ్చు. ఇది ఒక్కొక్క ప్రమాదానికి మృ తుల సంఖ్యను బట్టి కనిష్ఠంగా ఐదు లక్షల నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకూ ఉంటుంది. ఈ మేరకు ప్రతి ఏటా చమురు కంపెనీలు (ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ, భారత్‌ గ్యాస్‌, హిందుస్థాన్‌ పెట్రోలి యం) ఇన్సూరెన్స్‌ కంపెనీలే బీమా చెల్లిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఏటా వంద కోట్ల రూపాయల వరకూ క్లెయిములు పొందే అవకాశం కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే, ఈ అవకాశం ఉందన్న విషయమే చాలామందికి తెలియదు. విచిత్రం ఏమిటంటే, ఇలాంటి బీమా ఉందనే విషయం చాలా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ కంపెనీల్లోని సిబ్బందికి కూడా తెలియదు. అందుకే ఏళ్ల తరబడి కనీసం ఒక్కటంటే ఒక్క బీమా క్లెయిమ్ చెల్లించిన పాపాన పోలేదు. వాస్తవానికి, ప్రతి గ్యాస్‌ కంపెనీ ఈ విషయాన్ని తమ నోటీసు బోర్డులో పేర్కొనడం తప్పనిసరి. కానీ, ఒక్క గ్యాస్‌ కంపెనీ కూడా దీనిని పాటించడం లేదు. అసలు చాలాచోట్ల నోటీసు బోర్డులే ఉండవు.-పిఆర్‌
First Published:  30 March 2015 2:42 AM GMT
Next Story