సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం నుంచి రూ. 500 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ. 500 కోట్లు విడుదల చేసింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు 350 కోట్లు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు 150 కోట్ల రూపాయలు విడుదల చూస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాభావంతో కరవుకు ఆలవాలమై ఎడారి ఛాయలు సంతరించుకుంటున్న అనంతపురం జిల్లాతోపాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలకు కేంద్రం రూ. 350 కోట్లను విడుదల చేసింది. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లా అయిన అనంతపురానికి, కర్నూలు, చిత్తూరు, వై.ఎస్.ఆర్. కడప జిల్లాలకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ. 500 కోట్లు విడుదల చేసింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలకు 350 కోట్లు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు 150 కోట్ల రూపాయలు విడుదల చూస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాభావంతో కరవుకు ఆలవాలమై ఎడారి ఛాయలు సంతరించుకుంటున్న అనంతపురం జిల్లాతోపాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలకు కేంద్రం రూ. 350 కోట్లను విడుదల చేసింది. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లా అయిన అనంతపురానికి, కర్నూలు, చిత్తూరు, వై.ఎస్.ఆర్. కడప జిల్లాలకు ఈ నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ నిధులను విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి పథకం కింద వీటిని వెచ్చించాల్సి ఉంటుంది. దీంతోపాటు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో బాగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా కేంద్రం నిధులను విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు రూ. 50 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసినట్టు ప్రణాళికా సంఘం తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ విభాగం ఈ నిధులను ఇప్పటికే విడుదల చేసిందని, ప్రత్యేక అభివృద్ధి పథకం కింద వీటిని ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.-పిఆర్