అడుసు తొక్కనేల... కాలు కడగనేల...
ఏపీ స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైకాపా… ఆ తర్వాత సారీ చెప్పుకున్ని వివాదానికి ముగింపు పలికారు. అయితే ఇది ఎంతవరకు వైకాపాకు, జగన్‌కు మైలేజీ ఇచ్చిందన్న ప్రశ్న ఉదయించినపుడు అసలు విషయం బోధపడుతుంది. ఈ విధంగా సారీ చెప్పకపోతే పరిస్థితి చెయ్యి దాటి ఓ ఆరు నెలలపాటు అసెంబ్లీ ముఖం చూడలేని పరిస్థితి వస్తుందని ముందే పసిగట్టిన జగన్ బృందం సారీ బాట పట్టింది. ఈ గండం నుంచి బయటపడడానికి జగన్‌కు అదొక్కటే […]
BY Pragnadhar Reddy28 March 2015 11:35 PM IST
X
Pragnadhar Reddy Updated On: 28 March 2015 4:34 PM IST
ఏపీ స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వైకాపా… ఆ తర్వాత సారీ చెప్పుకున్ని వివాదానికి ముగింపు పలికారు. అయితే ఇది ఎంతవరకు వైకాపాకు, జగన్‌కు మైలేజీ ఇచ్చిందన్న ప్రశ్న ఉదయించినపుడు అసలు విషయం బోధపడుతుంది. ఈ విధంగా సారీ చెప్పకపోతే పరిస్థితి చెయ్యి దాటి ఓ ఆరు నెలలపాటు అసెంబ్లీ ముఖం చూడలేని పరిస్థితి వస్తుందని ముందే పసిగట్టిన జగన్ బృందం సారీ బాట పట్టింది. ఈ గండం నుంచి బయటపడడానికి జగన్‌కు అదొక్కటే మార్గం. అసెంబ్లీకి సంబంధించినంత వరకూ జగన్ సారీతో ఈ వివాదం ముగిసిపోయి ఉండవచ్చు. బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్‌రాజు సారీ మార్గానికి బాటలు వేసి ఆదుకుని ఉండవచ్చు. కానీ జనం దృష్టిలో మాత్రం జగన్‌తోపాటు వైకాపా పలచనై పోయింది. ఇంత రచ్చ చేసి చివరికి సారీ చెప్పడమేంటి… అన్న ప్రశ్న వారిలో కలిగింది. అనవసరంగా అయిన దానికీ కాని దానికీ రచ్చ చేసి చివరికి సారీ చెప్పుకునే పరిస్థితిని వైసీపీ నాయకులు చేతులారా తెచ్చుకున్నారని అనుకుంటున్నారు. సారీ చెప్పిన తరువాత జగన్ మాట్లాడిన మాటలు విని జనం ఆశ్చర్య పోతున్నారు. సభాపతి మీద కోపంతోనో, ఆయన్ని పదవి నుంచి తప్పించాలనో జగన్, ఆ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టలేదట. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, తమకు కావాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అవిశ్వాస తీర్మానం పెట్టారట. అడుసు తొక్కనేల… కాలు కడగనేల? అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన పంథా మార్చుకుంటే జనం హర్షిస్తారు.-పిఆర్
Next Story