ఏపి ఆర్టీసీ బస్సుల్లో ఇక వైఫై!
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ దూర ప్రాంత ప్రయాణికులకు వైఫై అందించేందుకు సిద్ధమైంది. అయితే మొదటి గంట మాత్రమే ఉచితంగా ఇచ్చి ఆ తర్వాత గమ్యం చేరే వరకూ కేవలం రూ.10 చెల్లి స్తే ఈ సదుపాయం కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ సౌకర్యాన్ని ఇంద్ర, గరుడ, వెన్నెల సర్వీస్ బస్సుల్లో ప్రవేశపెట్టబోతోంది. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో ఈ సౌకరాన్ని మొదట కల్పిస్తామని, తర్వాత దశల వారీగా విస్తరిస్తామని బస్ భవన్ […]
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ దూర ప్రాంత ప్రయాణికులకు వైఫై అందించేందుకు సిద్ధమైంది. అయితే మొదటి గంట మాత్రమే ఉచితంగా ఇచ్చి ఆ తర్వాత గమ్యం చేరే వరకూ కేవలం రూ.10 చెల్లి స్తే ఈ సదుపాయం కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ సౌకర్యాన్ని ఇంద్ర, గరుడ, వెన్నెల సర్వీస్ బస్సుల్లో ప్రవేశపెట్టబోతోంది. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో ఈ సౌకరాన్ని మొదట కల్పిస్తామని, తర్వాత దశల వారీగా విస్తరిస్తామని బస్ భవన్ వర్గాలు తెలిపాయి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ఈ ప్రయత్నాలకు సిబ్బంది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 10 గంటలకు పైగా ప్రయాణిస్తున్న వందలాది బస్సుల్లో టీవీలే సరిగా పనిచేయడం లేదని, అలాంటిది వైఫై ఏమిటని డ్రైవర్లు, కండక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. టీవీ పని చేయకపోతేనే ప్రయాణికులు డ్రైవర్‌తో వాదనకు దిగుతారని, ఇక వైఫై కూడా పెడితే.. అది పని చేయకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.-పిఆర్