మూడు విద్యాసంస్థలకు శంకుస్థాపన
చిత్తూరు జిల్లాలో ఒకే రోజు మూడు విద్యా సంస్థలకు శంకుస్థాపన జరిగింది. జిల్లాలోని ఏర్పేడు మండలం మెర్లపాకలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ సంస్థల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ను […]
BY Pragnadhar Reddy29 March 2015 11:09 AM IST

X
Pragnadhar Reddy Updated On: 29 March 2015 11:22 AM IST
చిత్తూరు జిల్లాలో ఒకే రోజు మూడు విద్యా సంస్థలకు శంకుస్థాపన జరిగింది. జిల్లాలోని ఏర్పేడు మండలం మెర్లపాకలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ సంస్థల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఒకే రోజు, ఒకే జిల్లాలో మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు శంకుస్థాపన చేయడం ఇంతకు ముందెన్నడూ జరగలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఈ రంగానికే కేటాయించామని తెలిపారు. కేంద్రం నుంచి కూడా ఉన్నత విద్యకు రూ 255 కోట్ల నిధులు వచ్చాయని ఆయన తెలిపారు.-పిఆర్.
Next Story