పట్టిసీమ ఎత్తిపోతలకు శంకుస్థాపన
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాణిక్యాలరావు, ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సుదీర్ఘకాలం పడుతుంది కాబట్టి ఈలోపు రాష్ట్రంలోని కృష్ణాడెల్టా, రాయలసీమ నీటి అవసరాలను తీర్చడం కోసం […]
BY Pragnadhar Reddy29 March 2015 5:24 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 29 March 2015 5:24 AM GMT
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో ఏర్పాటు చేయనున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాణిక్యాలరావు, ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సుదీర్ఘకాలం పడుతుంది కాబట్టి ఈలోపు రాష్ట్రంలోని కృష్ణాడెల్టా, రాయలసీమ నీటి అవసరాలను తీర్చడం కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పట్ల ఏపీ అంతటా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక ఏడాది కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకెళ్లాలనే యత్నానికి అనుగుణంగా చంద్రబాబు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, గోదావరిలో వృథాగా సముద్రంలోకి పోయే జలాలను ఒడిసిపట్టి, పోలవరం కుడి కాల్వ ద్వారా వాటిని ప్రకాశం బ్యారేజ్‌కు తరలిస్తారు. పులిచింతల, పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తరలిస్తారు. అయితే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న సమయంలోనే పట్టిసీమకు శ్రీకారం చుట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయినప్పటికీ. ప్రభుత్వం పట్టించుకోకుండా బడ్జెట్లో ఈ పథకానికి రూ.1300 కోట్లు కేటాయించింది.-పిఆర్.
Next Story