బాణాసంచా కేంద్రంలో పేలుడు-ఆరుగురు మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గోకులపాడు సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరు నిండు ప్రాణాలు ఆగ్నికి ఆహుతయ్యాయి. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఆరుగురి పరిస్థితి విషయంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు చిన రాజప్ప, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో […]
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గోకులపాడు సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరు నిండు ప్రాణాలు ఆగ్నికి ఆహుతయ్యాయి. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఆరుగురి పరిస్థితి విషయంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు చిన రాజప్ప, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ ఆరా తీసి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ అవంతి శ్రీనివాస్ అవసరమైతే క్షతగాత్రులను కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చి మంచి వైద్యం అందించాలని ఆదేశించారు.-పిఆర్