ఢిల్లీ మెట్రో స్థాయిలో ఏపీలో మెట్రోరైల్
ఢిల్లీ మెట్రో సాంకేతికంగా పటిష్ఠంగా ఉందని, ఈ మెట్రో అధికారుల సలహా సహకారాలతో విజయవాడ, విశాఖ మెట్రోలను అద్భుతంగా రూపొందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీ మెట్రో రైలులో శివాజీ స్టేడియం నుంచి విమానాశ్రయానికి వెళ్లారు. ఆయనతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, నారాయణ తదితరులు ఉన్నారు. మెట్రో రైలులో చంద్రబాబు ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా డబ్బులు చెల్లించి టోకెన్లు తీసుకుని […]
BY Pragnadhar Reddy29 March 2015 6:52 AM IST
X
Pragnadhar Reddy Updated On: 29 March 2015 6:52 AM IST
ఢిల్లీ మెట్రో సాంకేతికంగా పటిష్ఠంగా ఉందని, ఈ మెట్రో అధికారుల సలహా సహకారాలతో విజయవాడ, విశాఖ మెట్రోలను అద్భుతంగా రూపొందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీ మెట్రో రైలులో శివాజీ స్టేడియం నుంచి విమానాశ్రయానికి వెళ్లారు. ఆయనతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, నారాయణ తదితరులు ఉన్నారు. మెట్రో రైలులో చంద్రబాబు ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా డబ్బులు చెల్లించి టోకెన్లు తీసుకుని చంద్రబాబు తదితరులు మెట్రోలో అడుగుపెట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాలను, ఉత్తమ సాంకేతిక పద్ధతులను తమ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని, ఇందులో భాగంగానే ఏపీ ప్రజల రాకపోకలకు అధునాతన రవాణా వ్యవస్థ మెట్రో రైల్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు వెంట ఉండి మెట్రో గురించి వివరించిన ఢిల్లీ మెట్రో బిజినెస్ డెవల్‌పమెంట్ డైరెక్టర్ ఎస్.డీ. శర్మ విజయవాడ, విశాఖల్లో మెట్రో వ్యవస్థ కోసం తమ అధ్యయనం పూర్తయిందని చెప్పారు._పిఆర్
Next Story