విద్యా సంస్థల అభివృద్ధికి రూ.255 కోట్లు- మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ రూ.255 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఎస్వీయూ, శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ, నాగార్జున, ఆంధ్రా వర్సిటీలకు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ. 80 కోట్లు, పాతపట్నం, చీపురుపల్లి డిగ్రీ కాలేజీలను ఆదర్శ కళాశాలలుగా మార్చడానికి ఒక్కో కళాశాలకు 12 కోట్లు చొప్పున రూ.24 కోట్లు, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీని విశ్వవిద్యాలయంగా స్థాయి పెంపొందించడానికి రూ.55 కోట్లు కేటాయింపులు […]
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా సంస్థల అభివృద్ధికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ రూ.255 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఎస్వీయూ, శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ, నాగార్జున, ఆంధ్రా వర్సిటీలకు రూ.20 కోట్ల చొప్పున మొత్తం రూ. 80 కోట్లు, పాతపట్నం, చీపురుపల్లి డిగ్రీ కాలేజీలను ఆదర్శ కళాశాలలుగా మార్చడానికి ఒక్కో కళాశాలకు 12 కోట్లు చొప్పున రూ.24 కోట్లు, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీని విశ్వవిద్యాలయంగా స్థాయి పెంపొందించడానికి రూ.55 కోట్లు కేటాయింపులు జరిగాయని మంత్రి గంటా తెలిపారు. ఏపీలోని మరో 48 డిగ్రీ కాలేజీలకు ఒక్కో కాలేజీకి రూ. రెండు కోట్ల చొప్పున రూ.96 కోట్లు కేటాయించినట్టు మంత్రి గంటా తెలిపారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యా ప్రమాణాల ఆధారంగా ఎ,బి,సి గ్రేడ్లు కేటాయిస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించారు.- పి.ఆర్.