భద్రాదిలో అంగరంగవైభవంగా సీతారాముల కల్యాణం
ఖమ్మం: భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేద మంత్రాల నడుమ చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నాన సీతారామచంద్రుల వివాహం వైభవోపేతంగా జరిగింది. ఆ తర్వాత వరుడు తరఫున ఒకరు, వధువు తరఫున మరొకరు పండితులు ముత్యాల తలంబ్రాలు తీసుకుని సీతారాముల శిరస్సుపై పోశారు. చరిత్రను కాపాడే లక్ష్యంతో ఐదు రకాల ద్రవ్యాలతో ఈ తలంబ్రాలు తయారు చేశారు. ఇందులో బియ్యం, ఆవునెయ్యి, పసుపు, కుంకుమ, గులాం పౌడరులతో కూడిన ద్రవ్యాలను తలంబ్రాలకు ఉపయోగించారు. […]
BY Pragnadhar Reddy28 March 2015 8:22 AM IST
X
Pragnadhar Reddy Updated On: 28 March 2015 8:22 AM IST
ఖమ్మం: భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేద మంత్రాల నడుమ చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నాన సీతారామచంద్రుల వివాహం వైభవోపేతంగా జరిగింది. ఆ తర్వాత వరుడు తరఫున ఒకరు, వధువు తరఫున మరొకరు పండితులు ముత్యాల తలంబ్రాలు తీసుకుని సీతారాముల శిరస్సుపై పోశారు. చరిత్రను కాపాడే లక్ష్యంతో ఐదు రకాల ద్రవ్యాలతో ఈ తలంబ్రాలు తయారు చేశారు. ఇందులో బియ్యం, ఆవునెయ్యి, పసుపు, కుంకుమ, గులాం పౌడరులతో కూడిన ద్రవ్యాలను తలంబ్రాలకు ఉపయోగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాద్రిలో జరుగుతున్న తొలి శ్రీరామ నవమి వేడుకల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సతీసమేతంగా పాల్పొన్నారు. బియ్ముల కల్యాణానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
కడప జిల్లా ఒంటిమిట్టలో…కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామస్వామికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఒంటిమిట్టలో ధ్వజారోహణం వైభవంగా సాగింది. కనుల పండువగా జరిగిన శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వచ్చేనెల ఆరో తేదీ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. -పిఆర్
Next Story