‘టి’లో విద్యుత్ చార్జీల పెంపు... 400 యూనిట్లు దాటితే బాదుడే!
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతి తెలిపింది. ఈమేరకు ఈఆర్సీ చైర్మన్ అలీఖాన్ శుక్రవారం పెరిగిన ధరల వివరాలను ప్రకటించారు. 200 యూనిట్ల లోపు వాడుకునే విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం లేకుండా చూశారు. అలాగే పౌల్ట్రీలకు యూనిట్‌కు రెండు రూపాయలు తగ్గించారు. ఈఆర్సీ ప్రకటన ప్రకారం… 200 యూనిట్ల లోపు గృహవినియోగదారులకు చార్జీల పెంపు ఉండబోదని, దీంతో 80 లక్షల మందిపై ఎలాంటి చార్జీల భారం పడదని అన్నారు. రెండు వందలకు పైగా యూనిట్లు […]
BY Pragnadhar Reddy28 March 2015 1:12 AM IST
X
Pragnadhar Reddy Updated On: 28 March 2015 1:12 AM IST
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతి తెలిపింది. ఈమేరకు ఈఆర్సీ చైర్మన్ అలీఖాన్ శుక్రవారం పెరిగిన ధరల వివరాలను ప్రకటించారు. 200 యూనిట్ల లోపు వాడుకునే విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం లేకుండా చూశారు. అలాగే పౌల్ట్రీలకు యూనిట్‌కు రెండు రూపాయలు తగ్గించారు. ఈఆర్సీ ప్రకటన ప్రకారం… 200 యూనిట్ల లోపు గృహవినియోగదారులకు చార్జీల పెంపు ఉండబోదని, దీంతో 80 లక్షల మందిపై ఎలాంటి చార్జీల భారం పడదని అన్నారు. రెండు వందలకు పైగా యూనిట్లు వినియోగించే గృహ వినియోగదారులపై 1.3 శాతం మేర అదనపు చార్జీల ఉంటుందని తెలిపారు. అదే విధంగా హెచ్‌టి, ఎల్టీ వినియోగదారులపై పెంపుదల భారం 4.42 శాతం ఉంటుందని అలీఖాన్ వివరించారు. ఇకపోతే వ్యవసాయం, కుటీర పరిశ్రమలకు చార్జీలు పెంచలేదన్నారు. మొత్తంగా విద్యుత్ చార్జీల పెంపు వల్ల ప్రజలపై రూ. 816 కోట్లు భారం పడనుందని తెలిపారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం రూ. 4,227 కోట్ల రాయితీ ఇస్తుందని, 400 యూనిట్ల తర్వాత ఒకే స్లాబ్ ఉంటుందని ఈఆర్సీ చైర్మన్ అలీఖాన్ వివరించారు..- పి.ఆర్.
Next Story